Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఒకేసారి క్యూట్ గా హాట్ గా..!

By:  Tupaki Desk   |   21 Jun 2019 1:36 PM GMT
ఫోటో స్టొరీ: ఒకేసారి క్యూట్ గా హాట్ గా..!
X
టాలీవుడ్ లో ఉన్న అందాల భామల్లో రాశి ఖన్నా ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా గ్లామర్ ఒలకబోసే పాత్రలు చేసినప్పటికీ 'తొలిప్రేమ' నుంచి రూట్ మార్చింది. నిజానికి 'తొలిప్రేమ'తోనే మొదటిసారిగా రాశి ఒక మంచి పెర్ఫార్మర్ అనిపించుకుంది. ఆ సినిమా తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న 'శ్రీనివాస కళ్యాణం' మాత్రం నిరాశపరిచింది. అయితే ఆ నిరాశనుండి బైటకువచ్చి తన కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తోంది. అంతే కాదు.. సోషల్ మీడియాలో మంటలు పెట్టే కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది.

తాజాగా రాశి తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు రాశి ఇచ్చిన క్యాప్షన్ "మీ కోరుకున్నది దక్కించుకోవడానికి మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే ధైర్యం ఉండాలి." నిజమే.. మనం అనుకున్నది సాధించాలంటే ధైర్యం అవసరమే. లేదంటే మన నిర్ణయాలను మన ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు కదా! ఇక ఫోటో విషయానికి వస్తే వైట్ టాప్.. వైట్ కలర్ లోనే ఉన్న మైక్రో నిక్కర్ వేసుకొని ఒక చైర్ పై కూర్చుంది. డ్రెస్ కొత్తగా ఉంది. డీప్ వీ నెక్ ఉన్న టాప్ కావడంతో ఫోటో కోసం అందాలు రాసులు పోసినట్టుగా కనిపిస్తోంది. లైట్ గా బ్రౌన్ షేడ్ లో స్టైలింగ్ చేసిన హెయిర్.. ఈ డ్రెస్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే మేకప్ తో అందాల బొమ్మలాగా కనిపిస్తోంది. సడెన్ గా చూస్తే ఏ జపాన్ బొమ్మో అనుకుంటారు.

అందుకేనేమో 'బెఫిక్రే' బ్యూటీ వాణి కపూర్ ఈ ఫోటోకు ఒక లైక్ వేసుకుంది. ఈ ఫోటోకు నెటిజనుల రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. "ఒకేసారి క్యూట్ గా హాట్ గా.. అలా ఎలా?".. "డ్రీమ్ గర్ల్".. "సూపర్ రాశి.. ఉమ్మ".. "వైట్ లో మోడరన్ ఏంజెల్" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం వెంకటేష్ - నాగ చైతన్యల మల్టి స్టారర్ 'వెంకీమామ' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో చైతుకు రాశి జోడీగా నటిస్తోంది. ఇవి కాకుండా తమిళంలో 'కడైసి వ్యవసాయి'.. 'సంగ తమిళన్'.. 'షైతాన్ కా బచ్చా' అనే మూడు సినిమాల్లో నటిస్తోంది.