Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: స్లిమ్ముగా... బికినీలో స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 2 Aug 2019 2:25 PM GMTటాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ల లిస్టులో ఉన్న ఒక భామ రాశి ఖన్నా. మొదట్లో చబ్బీగా ఉన్న ఈ భామ గ్లామర్ పాత్రలే చేస్తూ వచ్చింది కానీ 'తొలిప్రేమ' తో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. నటిగా పేరు తెచ్చుకోవడంతో ఆగిపోకుండా స్లిమ్ముగా ఈ జెనరేషన్ హీరోయిన్ లాగా మారిపోయి అందరికీ ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది.
అదే ట్రెండ్ కొనసాగిస్తూ తాజాగా రాశి తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. ఇండియా హెల్త్ కేర్ అనే మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ లో పాల్గొంది రాశి. ఈ మ్యాగజైన్ ఆగష్టు ఎడిషన్ కవర్ పేజిపై రాశి మొనోకిని ధరించి ఒక తారలా మెరిసింది. ఈ ఫోటోలకు "రిజల్ట్ కావాలంటే ఓర్పు.. పోరాటం.. శ్రమ అన్నీ ఉండాలి. మార్పు అనేది సమర్పణ.. బలం అనే రెండు అంశాల సమాహారం" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. లైట్ కలర్ మోనోకిని.. పైనేమో పారదర్శకంగా ఉండే ఒక ఒక టాప్.. స్కర్ట్ లాంటి డ్రెస్ ను ధరించింది. యాక్సెసరీస్ లేకుండా మినిమమ్ మేకప్ తో.. లైట్ కలర్ లిప్ స్టిక్ తో ఫ్యాషనిస్టా తరహాలో కనిపిస్తోంది. హెయిర్ స్టైలింగ్ కూడా సూపర్ గా ఉంది.
ఈ ఫోటోకు నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన లభించింది. కొందరేమో "బ్యూటిఫుల్ బేబ్ ఇన్ టీ టౌన్".. "మెస్మరైజింగ్ పోజ్ రాశి" లాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. కొందరు మాత్రం "మీరు ఇలాంటి ఫోటోలు పెట్టొద్దు".. ఈ బికినీలు మీకు సూట్ కాలేదు అని తమ అభిప్రాయం వెల్లడించారు.ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'వెంకీ మామ' తో పాటుగా తమిళంలో 'షైతాన్ కా బచ్చా'.. 'కడైసి వ్యవసాయి'.. 'సంగ తమిళన్' అనే సినిమాల్లో నటిస్తోంది.