Begin typing your search above and press return to search.

దివి నుంచి దిగి వ‌చ్చిన ఈ దేవ క‌న్య మ‌ళ్లీ బిజీ అయ్యేనా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 9:38 AM GMT
దివి నుంచి దిగి వ‌చ్చిన ఈ దేవ క‌న్య మ‌ళ్లీ బిజీ అయ్యేనా?
X
రాశి ఖన్నా.. ఈ అందాల భామ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసిన‌ ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో తీవ్రంగా సతమతం అవుతుంది.

రీసెంట్ గా ఆమె నటించిన 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ' చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కోలీవుడ్ లోనూ పలు సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా రాశి ఖ‌న్నాను సక్సెస్ వరించలేదు. ఆఫ‌ర్లు కూడా బాగా త‌గ్గిపోయాయి. తెలుగులో ఈ అమ్మ‌డి చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు.

ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో.. రాశి ఖన్నాకు 'సర్దార్' రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి పడింది. తమిళ స్టార్ కార్తి హీరోగా పీఎస్ మిత్ర‌న్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై థ్రిల్లర్ అక్టోబర్ 21న తమిళం తో పాటు తెలుగులోనూ విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

చాలా కాలం తర్వాత రాశి ఖ‌న్నా ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సర్దార్ ఇచ్చిన హిట్ తో రాశి ఖ‌న్నా మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. రాశి ఖ‌న్నా కూడా అదే జరగాలని ఆశ‌ప‌డుతోంది.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో తాను ఇంకా ఫామ్ లోనే ఉన్నానని తెలియజేస్తోంది. తాజాగా కూడా ఆరెంజ్ కలర్ స్ట్రాప్ లెస్ ఫ్రాక్ ను ధరించిన రాశి ఖ‌న్నా.. మెడలో ధ‌గ‌ధ‌గ‌లాడే సింపుల్ చోకర్, హై హిల్స్ వేసుకుని అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది.

దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ కన్య మాదిరి ఆరెంజ్ ఫ్రాక్ లో రాశి ఖన్నా తన అందంతో ఆకర్షిస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కు అటు అభిమానులు, ఇటు నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. రాశి అందంపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో రాశి ఖ‌న్నా తాజా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మరి ఇకనైనా ఈ అమ్మడు మునుపటి మాదిరి వరుస ఆఫర్లను అందుకుని మ‌ళ్లీ బిజీ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.