Begin typing your search above and press return to search.
రాశీ ఖన్నాకు కళ్యాణం కళ ఉట్టిపడుతోందే
By: Tupaki Desk | 15 Dec 2020 10:10 AM GMTకక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు పెద్దలు. 2020లో సెలబ్రిటీ వెడ్డింగ్స్ ఇది ప్రూవ్ చేశాయి. వరుసగా హీరోలు హీరోయిన్లు పెళ్లితో ఓ ఇంటివాళ్లయిపోతుంటే వయసు మీద పడుతున్న హీరోలు అందాల భామల్లో ఒకటే టెన్షన్ నెలకొంటోందట.
అన్నట్టు సిల్వర్ స్క్రీన్ పై ఎన్నిసార్లు పెళ్లాడినా .. ఆకాశంలో చుక్క వైపు పంతులు గారి సమక్షంలో వేలు చూపించినా కానీ తమకు రియల్ లైఫ్ లో పెళ్లెప్పుడు? అన్న టెన్షన్ మాత్రం అంత త్వరగా తీరదు. ప్రస్తుతం ఉన్న నవతరం నాయికల్లో అందాల రాశీ ఖన్నా సన్నివేశం అలానే ఉంది మరి. శ్రీనివాస కళ్యాణంలో నితిన్ ని పెళ్లాడి చుక్కను చూసింది కానీ రియల్ లైఫ్ లో పెళ్లి గురించి మాత్రం ఏదీ చెప్పడం లేదు రాశీ. ఇప్పటికే నితిన్ కూడా పెళ్లితో ఓ ఇంటివాడైనా తనకు ఏ క్లారిటీ రాలేదు.
ఇదిగో ఇటీవల ఓ పెళ్లి వేడుకలో భల్లే భల్లే అంటూ సందడికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో రాశీ ట్రెడిషనల్ డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శిస్తుంటే అదే పెళ్లిలో యువకులంతా పరేషాన్ అయిపోయారు మరి. పంజాబీ వెడ్డింగ్ స్టిల్స్ చూస్తుంటే ఇది నిజం పెళ్లేనా లేక అడ్వర్టయిజ్ మెంట్ పెళ్లా అన్నది రాశీనే చెప్పాలి. అన్నట్టు రాశీ ఖన్నాలో కళ్యాణం కళ ఉట్టిపడుతోంది! అంటూ కుర్రాళ్లు కలలు కనేస్తున్నారు. 2021లో అడుగు పెడుతున్న వేళ అలాంటి గుడ్ న్యూస్ ఏదైనా చెబుతుందో ఏమిటో!