Begin typing your search above and press return to search.

పిక్ టాక్: రాశీఖన్నా.. అందాల రాసులు ఆరబోసిందిగా!

By:  Tupaki Desk   |   27 Dec 2020 3:33 AM GMT
పిక్ టాక్: రాశీఖన్నా.. అందాల రాసులు ఆరబోసిందిగా!
X
వెండి వెన్నెలతోో పోతపోసినట్టుగా తళతళామెరిసిపోతోంది కదూ ఈ బ్యూటీ! సహజంగానే చబ్బీ చీక్స్ తో కుర్రకారు మనసు దోచుకునే ఈ ముద్దుగమ్మ.. వైట్ అండ్ వైట్ సింగిల్ వియర్ తో పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. కూల్ కూల్ వింటర్లో.. తన హాట్ హాట్ స్టిల్స్ తో వామ్ ట్రీట్ ఇచ్చింది రాశీఖన్నా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు రాశీ ఫ్యాన్స్.

నిజానికి.. వణికిస్తున్న ఈ వింటర్లో ప్రపంచం మొత్తం టాప్ టూ బాటమ్ కవర్ చేస్తోంది. దానికి అదనంగా ఉన్ని ఫ్యాబ్రిక్స్, స్వెటర్స్ వేసుకొని రూమ్ లో సెట్ అయిపోయింది. కానీ.. ఈ అమ్మడికి ఉక్కపోత పోస్తుందా..? అన్నట్టుగా దుస్తులు వేసుకుంది రాశీ. అయితే.. ఈ హాట్ పిక్ చూసిన ఫ్యాన్స్ కు మాత్రం ఒంట్లోంచి స్వెట్ వచ్చేలా ఉంది.

రాశీఖన్నాా.. తరచూ ఇలాంటి విజువల్ ట్రీట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తూనే ఉంటుంది. అయితే.. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ పిక్ ఫ్యాన్స్ తో కేక పెట్టిస్తోంది. వాంటెడ్ గా తన అసెట్స్ ను బయటపెట్టేలా ఉన్న బ్యూటీ షోని చూస్తున్న యూత్.. ‘పరువం వానగా నేడు కురిసేనులే..’ అని పాడుకోవాలేమో..

కాగా.. ఇప్పుడు ఈ అమ్మడు బ్యాక్ టూ పెవిలియన్ అంటూ బాలీవుడ్ వెళ్లింది. లేటెస్ట్ గా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ రూపొందించిన రాజ్ & డికె.. రాశీఖన్నా లేటెస్ట్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.