Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: గాగుల్స్ పెట్టి గంగవెర్రులెత్తించింది!
By: Tupaki Desk | 18 Sep 2021 2:30 AM GMTఅవకాశాలు తగ్గిన కథానాయికలు.. బుల్లితెర యాంకర్లు వరకు ఇన్ స్టాని హాట్ హాట్ ఫొటో షూట్ లతో హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక ఫొటోషూట్ లతో అందాల విందు చేస్తూ నెటిజన్స్ తో పాటు మేకర్స్ కి వల వేస్తుంటారు. ఈ ఫార్ములా చాలా వరకు వర్కవుట్ అవుతుండటంతో స్టార్ హీరోయిన్ లతో పాటు టెలివిజన్ హాట్ యాంకర్స్ అవకాశాలు తగ్గిన ప్రతీసారి ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ సోషల్ మీడియాని తమదైన స్టైల్లో హీటెక్కించేస్తున్నారు.
ఇదే ఫార్ములాని రాశీఖన్నా ఈ మధ్య తెగ వాడేస్తోంది. శ్రీనివాస్ అవసరాల డైరెక్టోరియల్ మూవీ `ఊహలు గుస గుసలాడే` చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రాశీఖన్నా ఆ తరువాత వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంది కానీ సక్సెస్ లని మాత్రం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం రేసులో వెనకబడిన రాశీఖన్నా మళ్లీ టాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలే చేస్తోంది. తెలుగులో ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న `పక్కా కమర్షియల్`తో పాటు నాగచైతన్య నటిస్తున్న `థ్యాంక్యూ`లో చేస్తోంది. ఈ రెండు చిత్రాలతో మళ్లీ తెలుగులో పుంజుకోవాలన్నది రాశీ ప్లాన్.
ఇదిలా వుంటే తమిళంలో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా వున్న రాశీ సోషల్ మీడియాని వరుస హాట్ ఫొటోషూట్ లతో హీటెక్కిస్తోంది. ఇదంతా తనకు ఇష్టం లేదని చెబుతూనే ఐ లవ్ ఇట్ అంటూ పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో .. వెరీ హాట్ గా రెడీ అయిన రాశీ .. బ్లాక్ గాగుల్స్ ధరించి మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది. తను షేర్ చేసిన ఫొటోలకు ఆసక్తికరమైన క్యాప్షన్ ని జతచేసింది. ద ఫ్యాషన్.. ది పాషన్.. ది గ్రేస్.. ద రన్నింగ్... ద ట్రావెల్.. ద మ్యాడ్నెస్.. ఐ హేట్ ఇట్ అండ్ ఐ లవ్ ఇట్ అని బ్లాక్ లవ్ సింబల్ ని జతచేసింది. రాశీ బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టింది. ఇక ఆ అందమైన కళ్లకు గాగుల్స్ పెట్టి గంగవెర్రులెత్తించింది! అంటూ వేడెక్కించే కామెంట్లు చేస్తున్నారు యూత్.