Begin typing your search above and press return to search.
ఏదైనా నచ్చితేనే చేస్తుందట
By: Tupaki Desk | 30 Oct 2017 11:30 PM GMTఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకొంది. మొదట కుర్ర హీరోలతోనే ఎక్కువగా నటించిన ఈ భామ మెల్ల మెల్లగా ఓ రేంజ్ ఉన్న హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోంది. అంతే కాకుండా అవకాశాలు వచ్చినప్పుడు అవసరమైతే గ్లామర్ డోస్ ని కూడా బాగానే పెంచుతోంది.
చబ్బీ లుక్స్ తో తనదైన శైలిలో అందాలను ప్రదర్శించి కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. అయితే రీసెంట్ గా అమ్మడు తన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపింది. కేవలం తనకు సెట్ అయ్యే పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేస్తున్నానని చెబుతూ.. ముందు కథ విన్న తర్వాతే ఒకే చెబుతా అని చెప్పుకొచ్చింది. కథ బావుంటేనే సరిపోదు కథలో పాత్ర కూడా చాలా బావుండాలి. నాకు నచ్చితే ఎంతో ఇష్టంగా చేస్తా.. ముఖ్యంగా సుప్రీమ్ సినిమాలో చేసిన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టమని అమ్మడు వివరించింది. ఈమె మలయాళంలో చేసిన మోహన్ లాల్ 'విలన్' సినిమాలోని పాత్ర అందరినీ ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు రాశి ఖన్నా ఇలా చెబుతోందిలే.
ఇక త్వరలోనే మలయాళంలో తన హవాను కొనసాగిస్తాను అంటూ వివరించింది ఈ ఢిల్లీ బ్యూటి. ప్రస్తుతం రాశి చేతిలో దాదాపు అయిదు సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా మరి కొన్ని కథలను కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రెండవసారి గోపీచంద్ తో నటించిన ఆక్సీజన్ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. అలాగే వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాతో తో పాటు రవితేజ టచ్ చేసి చూడు సినిమాల్లో కూడా నటిస్తోంది.