Begin typing your search above and press return to search.
రాశీ దెబ్బకు రౌడీ అంత భయపడ్డాడట!
By: Tupaki Desk | 9 Feb 2020 5:30 PM GMTవిడుదలకు సిద్ధం కావటమే కాదు.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ప్రేమికుల దినోత్సవాన విడుదలవుతున్న ఈ సినిమా మీద చాలానే అంచనాలు ఉన్నాయి. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ తర్వాత విజయ దేవరకొండ నటించిన ఈ చిత్రానికి ఇప్పటికే మాంచి బజ్ వచ్చింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని అంతకంతకూ ముమ్మరం చేస్తున్నారు.
నలుగురు హీరోయిన్లతో నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన పాత్రను తానెంతో ప్రభావితమయ్యాయనని.. లీనమై నటించినట్లు చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు యామిని అని.. తానెంత ఇన్ వాల్వ్ అయ్యానంటే.. కొన్ని సన్నివేశాలు నటిస్తున్నప్పుడు తాను ఏడ్చేసేదానినని.. తాను అలా ఏడవటం చూసి హీరో విజయ్ దేవరకొండ.. దర్శకుడు క్రాంతి మాధవ్ లు భయపడేవారన్నారు.
యామిని పాత్రను తాను ఫీల్ అయి చేయటంతో అలాంటి పరిస్థితి ఉండేదన్నారు. పాత్రకు కనెక్ట్ కావటం వల్లే డబ్బింగ్ సైతం కేవలం రెండు రోజుల్లో పూర్తి చేశానని చెప్పారు. డబ్బింగ్ చేసేందుకు వెళ్లేటప్పుడు అసలు తాను చెప్పగలనా? అని అనుకున్నానని.. కానీ రెండు రోజుల్లోనే పూర్తి చేశానని చెప్పారు. తానిప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రగా రాశీ చెప్పింది.
ఒకవేళ తానొక రిలేషన్ షిప్ లో ఉండి ఉంటే.. ఎలా ఉంటాను? పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటాను? అలాంటి విషయాన్ని తనకు తాను ఫీలై చేసిన సినిమాగా చెప్పుకొచ్చారు. టీజర్ చూసి తన అభిమానులు ఫీలయ్యారని.. కానీ సినిమా చూస్తే మాత్రం కచ్ఛితంగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చింది. ఈ మాటల్లో నిజమెంతన్నది తేలాలంటే శుక్రవారం వరకూ వెయిట్ చేస్తే సరిపోతుంది.