Begin typing your search above and press return to search.
ఏడుపు గురించే చెప్పావేంటి రాశీ?
By: Tupaki Desk | 6 Aug 2018 2:25 PM GMTడిల్లీ బ్యూటీ రాశిఖన్నా ఆనందానికి అవధుల్లేవు. తొలి ప్రేమ విజయం తర్వాత అందుకు దీటైన సినిమా చేశానన్న తృప్తి ఆమెలో కనిపిస్తోంది. `శ్రీనివాసకళ్యాణం`తో కెరీర్ మరో స్థాయికి వెళుతుందని ఆమె కాన్ఫిడెంట్ గా చెబుతోంది. మరో మూడు రోజుల్లోనే రానున్న ఆ సినిమా ప్రమోషన్ల కోసం నడుం బిగించింది రాశి. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో సమావేశమైంది. పెళ్లి సినిమా చేసింది కాబట్టేనో లేదంటే ఇతర కారణాలో తెలియవుకానీ - ప్రెస్ మీట్ కి కూడా సంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే వచ్చేసింది.
అయితే ఆమె సినిమా చూశాక ఎవరెవరు ఏడ్చారనే విషయం మీదే ఎక్కువగా మాట్లాడింది. ముందు తన పాత్రకి డబ్బింగ్ చెప్పిన ప్రియాంక మొదలుకొని హీరో నితిన్ వరకు చాలా మంది ఏడ్చారని చెప్పుకొచ్చింది. మగాళ్లు సినిమా చూసి ఏడవడం అరుదనీ, కానీ తన తండ్రి మొదలుకొని చాలామంది మగాళ్లు ఈ సినిమా చూసి ఏడ్చారని చెప్పుకొచ్చింది. ఈ సినిమా స్పెషల్ షో వేసుకొని చిత్రబృందం మొత్తం వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూసింది. ఆ షోలో జనాల ప్రతిస్పందన గురించే రాశి ఎక్కువగా ప్రెస్ మీట్లో మాట్లాడింది. పతాక సన్నివేశాలు చూశాక ఎవ్వరైనా కంట తడి పెట్టుకోవల్సిందే అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఏడుపు గురించే ఎక్కువగా చెబితే ఈ సినిమా మరో రకంగా టర్న్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు సినీ జనాలు. రాశి చూస్కో మరి!