Begin typing your search above and press return to search.

తొలిప్రేమకు ఆమె కిక్ ఇస్తుందా?

By:  Tupaki Desk   |   26 Jan 2018 12:53 AM GMT
తొలిప్రేమకు ఆమె కిక్ ఇస్తుందా?
X
టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతీ వారం సినిమాల పండుగే. కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చిందంటే చాలు.. క్రేజీ మూవీస్ క్యూ కట్టేస్తున్నాయి. అలా ఫిబ్రవరి 9న రాబోతోన్న చిత్రాల్లో వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ కూడా ఉంది. ప్రస్తుతం తొలి ప్రేమ హంగామా బాగానే నడుస్తోంది. పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యువతను కట్టిపడేస్తున్నాయి. థమన్ అందించిన సంగీతానికి అంతా ఫిదా అవుతున్నారు.

ఇక హీరో వరుణ్ తేజ్ అయితే.. ఫిదా అంటూ కుర్రకారును ప్రేమలో ముంచేసి.. సూపర్ ట్రాక్ లో ఉన్నాడు. కానీ ఈ సినిమా విషయంలో అంతో ఇంతో అనుమానం కలిగిస్తున్న ఒకే ఒక్క అంశం హీరోయిన్. తొలి ప్రేమ అనగానే.. పవన్ కళ్యాణ్ మూవీ తొలిప్రేమ గుర్తుకురావడం సహజం. అలాగే ఆ చిత్రానికి కీర్తి రెడ్డి అస్సెట్ అయింది. ఇప్పుడు వరుణ్ తేజ్ తొలిప్రేమ విషయానికి వస్తే.. హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఈమె అందాలపై కానీ.. ఆకర్షణపై కానీ ఎలాంటి డౌట్స్ లేవు కానీ.. అసలు పాయింట్ ఏంటంటే.. ఈమె ఇప్పటికే పలు చిత్రాలు నటించడమే కాదు.. రానున్న సినిమాల పోస్టర్లకు సంబంధించిన హంగామా కూడా చేసేస్తుంది.

వరుణ్ తేజ్ తో ఈమె కాంబినేషన్ ఫ్రెష్ అవుతుంది కానీ.. జనాలకు రాశి ఖన్నా కొత్త కాదు. అందుకే తొలిప్రేమకు కొత్త హీరోయిన్ ను పెట్టుకుంటే బాగుండేదేమో అనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి.. రాశి ఆల్రెడీ ఇలా పక్క సినిమాల్లో గ్లామర్ ధారబోస్తుంటే.. తొలిప్రేమ హీరోయిన్ గా ఆ లవ్ కిక్ ఇస్తుందా? అన్నది వారి డౌట్ అంతే.. !