Begin typing your search above and press return to search.

మెగా హీరోను తెగ పొగిడేస్తోందంతే

By:  Tupaki Desk   |   7 Feb 2018 11:30 PM GMT
మెగా హీరోను తెగ పొగిడేస్తోందంతే
X
బొద్దుగా - ముద్దుగా ఉండే రాశి ఖన్నా ఒక్కసారిగా బరువు తగ్గినట్టు కనిపిస్తోంది. అది కూడా తొలి ప్రేమ సినిమా కోసమే ప్రత్యేకంగా తగ్గిందట. ఆ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి తెరను పంచుకుంది. ఎందుకోగాని మెగా హీరోను తెగ పొగిడేస్తోంది.

అమ్మడి కెరీర్లో ఉన్న సినిమాలలో ఒక్కటే ఒక్కటి హిట్ కొట్టింది. మిగతావన్నీ ఫ్లాపులు - లేకపోతే యావరేజ్ గా ఆడినవే. సుప్రీమ్ సినిమాలో ఆమె చేసిన బెల్లం శ్రీదేవి మాత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మధ్యన అయితే ఆక్సిజన్, టచ్ చేసి చూడు సినిమాలతో రెండు ఫ్లాపులను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడామెకు ఒక హిట్ కచ్చితంగా కావాలి. ఫిబ్రవరి 10న తొలిప్రేమ విడుదలవ్వబోతోంది. ఆ సినిమాపైనే హీరోయిన్ ఆశలన్నీ. అయితే ఆ సినిమా గురించి మాట్లాడుతూ వరుణ్ తెగ పొగిడేస్తోంది. ఆ సినిమాలో తాను వర్ష అనే క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పింది. మొత్తం ఏడు సంవత్సరాల కథను సినిమాలో చూపిస్తారని - అందుకే తాను వరుణ్ అందుకు తగ్గట్టు లుక్ లో వేరియేషన్స్ చూపించామని చెప్పింది. వరుణ్ తేజ్ తో పాటూ తాను జిమ్ లో ఎక్కువ కాలం గడిపేదాన్నని. ఇద్దరం క్యారెక్టర్ల కోసం అయిదు కిలోల బరువు పెరగడం - తగ్గడం చేస్తుండే వారమని తెలిపింది.

వరుణ్ రెండు రోజుల కోసారి మూడు పూటలా జిమ్ చేస్తాడని - ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాడని చెప్పుకొచ్చింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాడని తెలిపింది. అయినా ఆ విసయం బయటికి చెప్పుకోడంటూ ప్రశంసలు కురిపించింది. ఇప్పుడు ఈ మెగా హీరోని ఎందుకలా పొగిడేస్తోందో రాశిఖన్నా.