Begin typing your search above and press return to search.

మాస్ రాజా కూడా ఆమెతోనే రొమాన్స్?

By:  Tupaki Desk   |   29 Sept 2016 11:39 AM IST
మాస్ రాజా కూడా ఆమెతోనే రొమాన్స్?
X
గతంలో రింగులు జుత్తు బ్యూటి తాప్సీ పరిస్థితి ఇదే రకంగా ఉండేది. అసలు హిట్టు కొట్టినా కొట్టకపోయినా కూడా అమ్మడుకు డజన్లు కొద్దీ సినిమాలు వచ్చేసివి. అన్ని సినిమాల్లో విపరీతమైన గ్లామర్ ఆరబోశాక అమ్మడు పాపం తెలుగు సినిమాల నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఇకపోతే ఇప్పుడు అవే కళలు రాశి ఖన్నాలో కూడా కనిపిస్తున్నాయి.

త్వరలోనే మొదలవ్వబోయే దర్శకుడు బాబీ సినిమాలో ఇప్పుడు మాస్ రాజా రవితేజతో రాశి ఖన్నా రొమాన్స్ చేయనుందట. అమ్మడు ఆల్రెడీ అడ్వాన్సు పుచ్చుకుని ఎగ్రిమెంట్ సైన్ చేసిందని టాక్. ఇప్పటికే 'జిల్' సినిమాలో భారీ అందాలు ఆరబోశాక గోపిచంద్ తో రెండోసారి 'ఆక్సిజన్‌' అంటోంది అమ్మడు. అసలు 'శివమ్' ఫ్లాపైనా కూడా రామ్ కోసం 'హైపర్' అందాలను అట్టే అద్దేసింది. ఇప్పుడు 'బెంగాళ్ టైగర్' బికినీ ట్రీట్ తరువాత రవితేజతో కూడా అదే రచ్చంటే రాశీకే చెల్లింది. మొత్తానికి మాస్ రాజా కూడా ఇలా రెండోసారి రాశి ఖన్నా ను రిపీట్ చేయడంతో ఆమె రిపీట్ ఖన్నాగా వర్దిల్లే ఛాన్సుందండోయ్.

అయితే ఎన్నిసినిమాలు కొట్టినా కూడా.. రకుల్ తరహాలో ఒక భారీ హిట్టు మూటకట్టుకుని.. వెంటనే బిగ్ లీగ్ స్టార్స్ తో చేస్తేనే రాశి ఒక టాప్ హీరోయిన్ అయ్యేది. మరి హైపర్ తో ఆ ఛాన్సు కొడుతుందేమో చూద్దాం.