Begin typing your search above and press return to search.
విజయ్ సేతుపతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా...!
By: Tupaki Desk | 20 Oct 2020 10:30 AM GMTకోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''తుగ్లక్ దర్బార్''. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో అదితి రావ్ హైదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. కొంత షూటింగ్ జరిగాక కరోనా లాక్ డౌన్ రావడంతో సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇప్పుడు అదితి ఈ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేక 'తుగ్లక్ దర్బార్' నుంచి తప్పుకుంది. తాజాగా హైదరి స్థానంలో బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ని తీసుకున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంతకుముందు విజయ్ సేతుపతి - రాశీ ఖన్నా కాంబోలో 'సంగ తమిజన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
కాగా, రాశీ ఖన్నా దీనిపై స్పందిస్తూ 'తుగ్లక్ దర్బార్' లో భాగం అయినందుకు సంతోషంగా ఉందని.. చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాశీ డీ గ్లామర్ రోల్ లో కనిపించనుంది. ఇటీవల రాశీఖన్నా డీ గ్లామర్ ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మంజిమా మోహన్ - పార్థీవన్ ఇతర ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా గతేడాది చివరలో రాశీ 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండగే' వంటి రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ప్రస్తుతానికి రాశీఖన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మరి ఇప్పుడు 'తుగ్లక్ దర్బార్' సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.