Begin typing your search above and press return to search.

విజయ్.. ఆ భామ మాటలు విన్నావా?

By:  Tupaki Desk   |   10 Feb 2020 12:30 AM GMT
విజయ్.. ఆ భామ మాటలు విన్నావా?
X
టాలీవుడ్ లో ఏ హీరో కానీ.. మరే హీరోయిన కానీ సంచలన అంశాల్ని ప్రస్తావించటం.. ప్రకటించటం లాంటివి అస్సలు చేయరు. ఆ మాటకు వస్తే.. పాజిటివ్ తప్పించి.. నెగిటివ్ గురించి మాట్లాడరు. అలాంటి అప్రకటిత రూల్స్ ను బ్రేక్ చేశారు విజయ్ దేవరకొండ.. రాశీ ఖన్నాలు ఇద్దరూ. వీరిద్దరూ కలిసి చేసిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి మాట్లాడే క్రమంలో విజయ్ సంచలన వ్యాఖ్య చేశారు.

తానిక ప్రేమకథాంశాల్ని చేయనని.. తన అభిరుచులు మారుతున్నట్లుగా ప్రకటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ తన చివరి ప్రేమకథాచిత్రంగా పేర్కొన్నారు. ఈ మాట మీద ఎవరూ రియాక్ట్ కాలేదు. కాకుంటే.. లవ్ స్టోరీలకు సంబందించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోయారు.

ఇదిలా ఉంటే.. రౌడీ మాటకు ఎవరూ రియాక్ట్ కాని వేళ.. అనూహ్యంగా ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా స్పందించారు. విజయ్ ప్రకటించిన చివరి లవ్ స్టోరీ మాట కరెక్టు కాదన్నారు. తనకు తెలిసినంత వరకూ విజయ్ కు మహిళా అభిమానులు ఎక్కువని.. వారంతా విజయ్ ను ప్రేమకథా చిత్రాల్లో చూడాలని ఇష్టపడతారన్నారు. అందుకే అభిమానుల కోణంలో ఆలోచించి.. కొంత గ్యాప్ తర్వాత అయినా ప్రేమకథా చిత్రంలో నటిస్తాడని తానుఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్ వ్యాఖ్య మీద ఎవరూ స్పందించని వేళ.. రాశీ ఖన్నా మాత్రం అందుకు భిన్నంగా ఓపెన్ అయిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనికి విజయ్ స్పందన ఏమిటో?