Begin typing your search above and press return to search.
సూపర్ ఐడియా ఇచ్చేసిన ముద్దుగుమ్మ!
By: Tupaki Desk | 16 July 2019 6:01 AM GMTముట్టుకుంటే మాసిపోయే బ్యూటీలు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు రాశీ ఖన్నా. ముద్దుగా.. బొద్దుగా ఉండే ఈ భామ తన స్లిమ్ వెర్షన్ తో అదరగొట్టేయటం తెలిసిందే. ఇంత అందాన్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నావ్.. ఇందుకోసం నిత్యం పార్లర్ల చుట్టూ ప్రదక్షిణాలు తప్పవా? అంటే రాశీ భలే సమాధానం ఇచ్చింది.
స్కిన్ టోన్ ను కాపాడేందుకు తాను రోజూ పార్లర్ల చుట్టూ తిరగనంటే తిరగనని చెప్పిన ఆమె.. ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని సంరక్షించుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఎండకు చర్మం కమిలిపోయే సమస్యను అందరూ ఎదుర్కొంటారని.. నిజానికి ఈ పెద్ద సమస్యను చాలా చిన్న చిట్కాతో అధిగమించొచ్చని చెప్పారు. తన అందాన్ని సంరక్షించుకునేందుకు వంటింట్లో దొరికే చాలా వస్తువులు.. రోజువారీ తినే పండ్లు.. ఆకులతో చేసుకుంటానని చెప్పింది. శాంపిల్ గా ఒక ఐడియా చెబుతావా? అన్నంతనే టక్కున చెప్పేశారు. ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుందని.. ఫిల్టర్ అయ్యాక కాఫీ పొడిని పారేయకుండా కాస్త ఎండబెట్టుకొని దాచుకోవాలన్నారు. అలా దాచిన కాఫీపొడిని నీళ్లల్లో కాస్తంత తడిపి చర్మం మీద నలుగు పెట్టుకుంటే ఎంతటి టాన్ అయినా ఇట్టే పోతుందని చెప్పారు.
ఫిల్టర్ కాఫీ అలవాటు లేనోళ్లు బయట షాపుల్లో కాఫీ పొడి తెచ్చుకుంటే సరిపోతుందని.. మొదట్లో తాను షాపుల నుంచి కాఫీ పొడి తెచ్చుకొని అప్లై చేసే దానినని చెప్పుకొచ్చారు. మొత్తానికి బ్యూటీ టిప్ చెబుతూనే కాఫీ తనకు అలవాటు లేదన్న విషయాన్ని రాశీ భలేగా చెప్పేసిందిగా. అయినా.. ఇలా అందరూ బ్యూటీ టిప్ లు వాడేస్తే.. పార్లర్ల పరిస్థితేంటి? ఇలా చిన్న చిన్న చిట్కాలతో అందాన్ని కాపాడుకునే ఐడియాలో చెబితే పార్లర్ వ్యాపారాలు చేసుకునే వారి సంగతేంటి చెప్పు..?