Begin typing your search above and press return to search.

రాశి ఖన్నా.. సిల్లీ క్యారెక్టర్లు చెల్లవిక

By:  Tupaki Desk   |   12 Feb 2018 8:41 AM GMT
రాశి ఖన్నా.. సిల్లీ క్యారెక్టర్లు చెల్లవిక
X
తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి మంచి సినిమాలో మంచి పాత్రతో కథానాయికగా పరిచయమైంది రాశి ఖన్నా. కానీ ఆ తర్వాత ఆ స్థాయికి తగ్గ పాత్ర ఒక్కటీ రాలేదామెకు. అవకాశాలకు కొదవ లేకపోయినప్పటికీ పెద్దగా గుర్తింపు లేని రొటీనే క్యారెక్టర్లే చేసుకుంటూ వెళ్లింది రాశి. ‘సుప్రీమ్’ మినహాయిస్తే ఆమెకు పెద్ద కమర్షియల్ సక్సెస్‌ లు కూడా లేవు. ఆ సినిమాలో రాశి చేసిన బెల్లం శ్రీదేవి పాత్ర జనాల్ని ఆకట్టుకున్నప్పటికీ.. ఆమెకు ఆ పాత్ర కొంచెం చేటు చేసింది. రాశి సీరియస్ క్యారెక్టర్లకు సూట్ కాదేమో.. లవ్ స్టోరీల్లో ఇంటెన్స్ క్యారెక్టర్లు చేయడం ఆమె వల్ల కాదేమో అన్న అభిప్రాయం జనాల్లో, ఫిలిం మేకర్లలో పడిపోయింది. దీంతో ఆ తర్వాత రాశికి చాలా వరకు సిల్లీ క్యారెక్టర్లే వచ్చాయి.

ఇలాంటి సమయంలో వెంకీ అట్లూరి ‘తొలి ప్రేమ’లో రాశికి అవకాశం ఇచ్చాడు. నిజానికి ఆమె ఈ పాత్రకు సూట్ కాదని వెంకీ కూడా అనుకున్నాడట. వేరే హీరోయిన్లను ట్రై చేశాడట. ఐతే వరుణ్.. నిర్మాతలు రాశిని సజెస్ట్ చేశారట. ఆమెను టెస్ట్ షూట్ చేశాక ఓకే చేశాడట వెంకీ. అప్పటికే రాశికి ఉన్న ఇమేజ్‌ కు తోడు.. ‘తొలి ప్రేమ’లో ఆమె పరిచయ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చినపుడు ఇలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తను ఏమాత్రం సూటవుతుందో అని మరింతగా సందేహాలు కలిగాయి. కానీ సినిమాలో రాశి తన పాత్రకు చక్కగా పోషించి ప్రశంసలందుకుంది. సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఆమెదే. ఒక వ్యక్తిత్వం ఉన్న ఇంటెన్స్ క్యారెక్టర్లో రాశి మెప్పించింది. ఈ సినిమా చూశాక రాశి మీద ఉన్న అభిప్రాయాలే మారిపోయాయి. ఆమె ఎలాంటి పాత్ర అయినా చేయగలదన్న అభిప్రాయం జనాలకు కలిగింది. ఇకపై రాశికి ఇంతకుముందులా సిల్లీ క్యారెక్టర్లు ఆఫర్ చేయరేమో దర్శకులు. ఆమె టాలెంటుకి తగ్గ పాత్రలు ఇక ముందు మరిన్ని వస్తాయనడంలో సందేహం లేదు.