Begin typing your search above and press return to search.
పక్కా కామెడీ రోల్ లో బబ్లీ బ్యూటీ..!
By: Tupaki Desk | 15 April 2021 9:30 AM GMTయాక్షన్ హీరో గోపీచంద్ - దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. గత చిత్రం 'ప్రతీరోజూ పండగే' తో మంచి సక్సెస్ అందుకున్న మారుతి.. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా నే తీసుకున్నాడు. అందులో మారుతి రాసిన టిక్ టాక్ స్టార్ ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశీ మంచి కామెడీ పండించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో మరోసారి మారుతి ఆమె కోసం కామెడీ పాత్రనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'పక్కా కమర్షియల్' ఫస్ట్ లుక్ లో రాశీఖన్నాను లాయర్ గెటప్ చూపించి నల్లకోటు ధరించి ఆడియన్స్ ని నవ్వించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
అయితే ఇందులో రాశీఖన్నా సీరియల్ స్టార్ గా కనిపించబోతోందని.. ఈ పాత్ర ద్వారా సీరియల్స్ ట్రెండ్ ని సెటైరికల్ గా మారుతి చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఉగాదికి వదిలిన ఫొటోలో ఆమెను నల్లకోటు ధరించిన లాయర్ గా చూపించారు. మరి అది సీరియల్ లో భాగమా లేదా గోపీచంద్ తోపాటుగా రాశీ కూడా లాయర్ గా వర్క్ చేస్తుందా అనేది తెలియాలి. ఏదేమైనా విచిత్రమైన పాత్రల ద్వారా కామెడీ రాబట్టే మారుతి.. ఈసారి బెల్లం శ్రీదేవికి కామెడీ పాత్రనే సృష్టించినట్లు తెలుస్తోంది. 'ప్రతిరోజూ పండగే' తరహాలోనే రాశీకి 'పక్కా కమర్షియల్' పక్కా కమర్షియల్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.