Begin typing your search above and press return to search.
హైపర్ అందాలకు ఇంకా మెరుగులేల భామ
By: Tupaki Desk | 25 Nov 2016 7:30 AM GMTఆల్రెడీ ''హైపర్'' సినమా టైముకే బాగా సన్నబడి తన అందాలను తెగ ఆరేసింది చబ్బీ గాళ్ రాశి ఖన్నా. ఇప్పటికే బాగా సన్నపడిపోయిందని అందరూ నమ్మేశారు. అయినా కూడా రాశి మాత్రం.. జిమ్ లో కూర్చుని ఇంకా వెయిట్ తగ్గే పనిలో ఉన్నానంటూ మీడియాకు కబుర్లు పంపిస్తోంది. ఇంతకీ ఏందమ్మా ఈ కహానీ అంతా?
నిజానికి అందాలు ఏ రేంజులో దారబోసినా కూడా ఎందుకో రాశి ఖన్నా ఫేట్ మాత్రం మారడంలేదు. అమ్మడు ఎంత గ్లామరసం కురిపించేసినా కూడా రామ్ సరసన రెండోసారి చేసిన హైపర్ మూవీ కూడా ఫ్లాపే అయ్యింది. మూవీలో నిజానికి ఈమె గ్లామర్ తప్పించి పెద్దగా మ్యాటరే లేదు. కాని ఈమె ఖాతాలో హిట్టు పడనప్పుడు పెద్దగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు రావులే. అందుకే ఇప్పుడు ఇంకా సన్నబడుతున్నా..కొవ్వు కరిగిస్తున్నా..అంటూ తెగ ఫీలర్లు పంపిస్తోంది ఈ ఊహలు గుసగుసలాడే సోయగం. ఆల్రెడీ హైపరెత్తించే అందాలు సొంతమవ్వగా.. ఇంకా వాటికి మెరుగులేల భామ.. ఉన్న షైనింగ్ కూడా మిస్సయిపోతుందేమో.
ఇకపోతే మొన్నామధ్యన రామ్ చరణ్ సినిమా కోసం సుకుమార్ చేసిన ఆడిషన్ లో పాల్గొందిగా.. అప్పటినుండి ఆ సినిమా తనకే దక్కుతుందని చాలా ఆశలతో ఎదురుచూస్తోందట. చూద్దాం మరి ఏమవుతుంది. ఈలోపు అమ్మడు గోపిచంద్ సరసన ఆక్సిజన్ సినిమాలో నటించింది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/