Begin typing your search above and press return to search.

కుర్రకారులో సెగలు రేపుతున్న పక్కా కమర్షియల్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   17 March 2021 3:30 AM GMT
కుర్రకారులో సెగలు రేపుతున్న పక్కా కమర్షియల్ బ్యూటీ!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో రానురాను అందమైన కథానాయికల అందాలకు అసలు అడ్డులేకుండా పోతుంది. అంటే వారే ఇంతకాలం బంధించిన అందాలను ఒక్కొక్కటిగా ఫోటోషూట్స్ రూపంలో బయటపెడుతున్నారు. ముఖ్యంగా ముద్దుగుమ్మ రాశిఖన్నా.. ఈ అమ్మడు వచ్చింది ఢిల్లీ నుండే అయినా కొల్లగొట్టేది మాత్రం తెలుగు హృదయాలనే. రాశి ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. తన అందాన్ని కాపాడుకునేందుకు కూడా అంతే కేర్ తీసుకుంటుంది. కెరీర్ ప్రారంభం నుండి రాశి అందం అభినయంతో తెలుగు కుర్రకారు మతులు పోగొడుతోంది. ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే నుండి నేటి వరకు స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తూనే ఉంది. రాశి చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కనిపించింది.

ప్రస్తుతం అమ్మడు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో సెగలు రేపుతోంది. లాక్డౌన్ టైంలో కాస్తలావుగా కనిపించిన రాశి.. మళ్లీ వర్కౌట్స్ చేసి నాజూకుగా తయారయ్యింది. రాశికి సోషల్ మీడియా వాడకం బాగా తెలుసు. ఎప్పటికప్పుడు నాజూకు ఒంపుసొంపులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఊరిస్తూ ఉంటుంది. తాజాగా రాశి ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూస్తే రాశి.. ఫోటోషూట్ లో పాల్గొన్నట్లు క్లియర్ గా అర్ధమవుతుంది. మోడరన్ బ్లాక్ స్కర్ట్ లో అలా సేదతీరుతున్న పోజులో దర్శనమిచ్చింది. కానీ చూపరుల గుండెల్లో సెగలు రేపడం మాత్రం ఆపలేదు. రాశికి ముందే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటప్పుడు చూస్తూ ఊరికే ఉంటారా.. అమ్మడి గ్లామర్ కు ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమైపోయినా గ్లామర్ షోతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తానంటోంది ఈ పక్కా కమర్షియల్ సుందరి.