Begin typing your search above and press return to search.

నాజూకు అత్తతో క్యూట్ అల్లుడు..!

By:  Tupaki Desk   |   27 March 2021 3:30 PM GMT
నాజూకు అత్తతో క్యూట్ అల్లుడు..!
X
చిత్రపరిశ్రమలో ఈతరం హీరోయిన్లు సినిమాకోసం ఏం చేయడానికైనా రెడీనే అంటున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ ఫిట్నెస్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి ఇప్పుడున్న గ్లామర్ ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే ఫిట్నెస్ తప్పనిసరి అయింది. అందుకే మొదట్లో బొద్దుగా అలరించిన ముద్దుగుమ్మలు కూడా ఇప్పుడు కష్టపడి నాజూకుగా తయారవుతున్నారు. అలాంటి కఠోరదీక్షతో నాజూకుగా మారిన హీరోయిన్లలో రాశిఖన్నా ముందుంటుంది. పేరుకే ఢిల్లీగుమ్మ కానీ మెల్లగా సెటిల్ అవుతుంది మాత్రం సౌత్ ఇండస్ట్రీలోనే. ఊహలు గుసగుసలాడే సినిమాతో కెరీర్ ఆరంభించిన రాశి ముద్దుగా బొద్దుగా ఉండేది. ఆ బొద్దు అందాలతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

సినిమాసినిమాకు హీరోయిన్స్ బాడీని మేకోవర్ చేస్తుంటారు. బెంగాల్ టైగర్ మూవీ నుండి అమ్మడు నాజూకుగానే మెయింటైన్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రాశికి మిలియన్స్ లో ఫాలోయర్స్ ఉన్నారు. అందుకే అమ్మడు అప్పుడప్పుడు తన ఫిట్నెస్ రిలేటెడ్ ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తోంది. అయితే తన ఫోటోలు మాత్రమే కాకుండా రాశి.. వీలైనప్పుడల్లా తన అల్లుడు నీల్ ఖన్నా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఎంతో క్యూట్ గా కనిపించే రాశి అల్లుడు అత్త పక్కన కనిపించడంతో సెలబ్రిటీ కిడ్ అయిపోయాడు. కొన్నిసార్లు రాశి తన అల్లుడితో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ క్యూట్ అత్త అల్లుడు ఇద్దరూ కూడా జిమ్ నుండి బయటికి వస్తూ కెమెరా కంటపడ్డారు. రాశి తన అల్లుడికి మాస్క్ తో పాటు ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. ఫొటోలో చూడవచ్చు నీల్ రాశిని ఎలా చూస్తున్నాడో.. ప్రస్తుతం వారి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.