Begin typing your search above and press return to search.

నా కూతుర్ని సినిమాల్లోకి తీసుకురాను- రాశి

By:  Tupaki Desk   |   29 Jun 2015 1:30 PM GMT
నా కూతుర్ని సినిమాల్లోకి తీసుకురాను- రాశి
X
సినిమా రంగం చాలా మంచిందని.. తనకు గొప్ప లైఫ్‌ ఇచ్చిందని అంటోంది నిన్నటి తరం హీరోయిన్‌ రాశి. కానీ తన కూతుర్ని మాత్రం భవిష్యత్తులో సినిమాల్లోకి తీసుకొచ్చే అవకాశమే లేదంటోంది ఆమె. పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నానని.. ఐతే నందిని రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'కళ్యాణ వైభోగమే'లో తనకు ఆఫర్‌ చేసిన పాత్ర నచ్చి.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని రాశి చెప్పింది. వైవాహిక జీవితం గురించి.. భవిష్యత్‌ ప్రాజెక్టుల గురించి, తన పాప రిథిమ గురించి రాశి ఏమంటోందో చూడండి.

''పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలనుకున్నా. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా సినిమాలు ఒప్పుకోలేదు. స్క్రిప్టు బాగా నచ్చడంతో కళ్యాణ వైభోగమే ఒప్పుకున్నాను. దీని తర్వాత కూడా సినిమాల్లో కొనసాగాలా వద్దా అన్నది నిర్ణయించుకోలేదు. నా పాప రిథిమ గురించి ఇప్పుడు నా ఆలోచనంతా. తనను బాధ్యతాయుతమైన పౌరురాలిగా తీర్చిదిద్దాలి. తనకు మంచి కెరీర్‌ ఇవ్వాలి. తను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటే అది చేయనిస్తా. కానీ సినిమాల్లోకి మాత్రం రానివ్వను. భవిష్యత్తులో నిర్మాణ రంగంలోకి వచ్చే ఆలోచనలు ఎంతమాత్రం లేవు. ప్రస్తుతం నా ఫ్యామిలీ కమిట్మెంట్స్‌తో చాలా బిజీగా ఉన్నాను'' అని చెప్పింది రాశి.