Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఆలియా భట్ ఇరగదీసింది

By:  Tupaki Desk   |   10 April 2018 11:14 AM IST
ట్రైలర్ టాక్: ఆలియా భట్ ఇరగదీసింది
X
ఈ మధ్య ఇండో - పాక్ అనే సౌండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో బాగా వినిపిస్తోంది. దాయాధి దేశంతో జరిగిన పోరాటాలు గెలుపులు మోసాలు ఎన్నో వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపుతున్నారు. నటనకు ఆస్కారం ఉండే ఈ సినిమాల్లో తారలు సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ కూడా ఎప్పుడూ కనిపించని విధంగా ఇండో పాక్ తరహా కథలో కనిపిస్తోంది.

1971 లో ఇండో పాక్ వార్ నేపధ్యంలో రిలీజ్ కాబోతోన్న చిత్రం రాజి. కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. అయితే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఇండియన్ స్పై పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని దేశానికి ఏ విదంగా సహాయపడింది అనేదే అసలు కథ. కాలింగ్ సేహ్మత్ నోవేల్ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ లో సన్నివేశాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

బావోద్వేగం సినిమాలో హైలెట్ అని తెలుస్తోంది. ఒక స్పై గా వెళ్లిన సతీమణి పాకిస్థాన్ లో చేరి ఎలాంటి విషయాలను బయటపెట్టింది అనే సున్నితమైన కాన్సెప్ట్ చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. అలియా భట్ ఇంత వరకు ఇలాంటి ప్రయోగాత్మకమైన పాత్ర చేయలేదు. గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసిన ఆమెకు ఈ క్యారెక్టర్ పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. మరి సినిమా మొత్తంలో ఎలా నటించిందో చూడాలి. ట్రైలర్లో చూస్తే మాత్రం ఇరగదీసిందనే చెప్పాలి. మే11న గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేయాలని కరణ్ జోహార్ సన్నాహకలు చేస్తున్నాడు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి