Begin typing your search above and press return to search.

త‌ళా అజిత్ టాప్ సీక్రెట్ చెప్పేసిందిగా

By:  Tupaki Desk   |   12 April 2020 4:47 AM GMT
త‌ళా అజిత్ టాప్ సీక్రెట్ చెప్పేసిందిగా
X
త‌ళా అజిత్ వ్య‌వ‌హారికం ఏ ఇత‌ర హీరోతో పోల్చినా చాలా డిఫ‌రెంట్. ఆయ‌న‌ చాలా సంవత్సరాలుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న‌ సంగ‌తి తెలిసిందే. అతను తెరపై మాత్రమే కనిపిస్తాడు. ఓటేసేందుకో లేదా పిల్లలతో పాఠశాల వార్షికోత్స‌వానికో లేక ఇంకేదైనా కార్యక్రమానికో వెళుతుంటారు త‌ప్ప ప‌బ్లిక్ లో పెద్ద‌గా క‌నిపించ‌రు. త‌ను ఎందుకు బయటకు రాడు? అన్న‌దానికి కారణాన్ని ఆయ‌న‌ ఎప్పుడూ వెల్లడించడు కూడా. అయితే అందుకు కార‌ణాన్ని తాజాగా ఆయ‌న అభిమాని ఒక‌రు రివీల్ చేశారు.

చెన్నై బైకర్ అలీషా అబ్దుల్లా త‌ళా గుట్టు విప్పేసింది. అస‌లు అజిత్ బ‌యట‌‌కు రాకుండా ఇంట్లోనే ఉండటానికి కార‌ణ‌మేంటో చెప్పేసింది. అజిత్ స్వ‌త‌హాగానే బైక‌ర్ కాబ‌ట్టి అలీషాతో అత‌డికి చ‌క్క‌ని అనుబంధం ఉందిట‌. ఆ క్ర‌మంలోనే అజిత్ వ్య‌క్తిగ‌త విష‌యాల్ని త‌ను చాలా ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తుంద‌ట‌. ఇక అజిత్ అంటే త‌న‌కు ఎంతో గౌర‌వం అని చెప్పిన అలీషా త‌న‌ తండ్రి ఆర్‌ఐ అబ్దుల్లా- స్టార్ హీరో కం రేస‌ర్ అజిత్ పలు సందర్భాల్లో కలిసి రేస్ ట్రాక్ పై పోటీ పడిన‌ప్ప‌టి కొన్ని ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది.

అజిత్ రేసింగ్ ఫోటోలను షేర్ చేసి త‌న‌ చుట్టూ అభిమానులు రద్దీ ఎలా ఉండేదో కూడా వివ‌రించింది. ``అజిత్ స‌ర్ బహిరంగ ప్ర‌దేశాల‌కు రాకపోవటానికి కారణం.. ఫ్యాన్స్ త‌న‌కు ప్రైవ‌సీని ఇవ్వ‌క‌పోవ‌డ‌మే. రేస్ ట్రాక్ లోని సంఘటనల్లో కేవ‌లం ఇదో ఎగ్జాంపుల్ మాత్ర‌మే. ప్రజలు అతన్ని నడవడానికి కూడా దారి ఇవ్వ‌రు. మా త‌ళా సర్.. అంగుళం కూడా కదలలేకపోయారు ఆరోజు. అందుకే చివ‌రికి బయటకు రాకూడదని నిర్ణయించుకున్నారు`` అని వెల్ల‌డించింది అలీషా. త‌న కోరేస‌ర్ అయిన అబ్ధుల్లా వార‌సురాలు అలీషాతో అజిత్ కి చ‌క్క‌ని స్నేహానుబంధం ఉంది. అజిత్ ప్ర‌స్తుతం హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో వాలిమై అనే భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తున్నారు.