Begin typing your search above and press return to search.
సౌత్ లో రేసింగ్ పిచ్చి ఉన్న స్టార్లు ఎవరంటే?
By: Tupaki Desk | 14 July 2021 4:30 PM GMTకార్ రేస్.. బైక్ రేస్.. హార్స్ రైడింగ్.. ఫార్ములా వన్.. పోటీ ఏదైనా ఆసక్తిగా పాల్గొనే స్టార్లు ఎవరైనా ఉన్నారా? అంటే ఎందుకు లేరు. ఈ కేటగిరీలో తమిళ స్టార్ హీరో తళా అజిత్ ముందు వరుసలో ఉంటారు. ఆయన యుక్తవయసు నుంచి స్వతహాగానే రేసర్. కార్ రేసింగ్ లో ఫార్ములా వన్ రేసింగులో గొప్ప అనుభవజ్ఞుడు. ఎన్నో పథకాల్ని గెలుచుకున్నారు. హార్స్ రైడర్ గానూ అతడికి రికార్డులున్నాయి. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న సినిమాలోనూ కాప్ పాత్ర అంతా రేసింగ్ నేపథ్యంలో అదరగొడుతుందని తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్య ప్రొఫెషనల్ రేసర్ కాకపోయినా కార్ రేసింగ్ అంటే అతడికి ఆసక్తి. బ్రాండ్ న్యూ కార్ ఏదైనా షోరూమ్ లో కనిపిస్తే గ్యారేజీలోకి చేరాల్సిందే. హైదరాబాద్ ఖాళీ రోడ్ లో ఆయన సామ్ తో కలిసి రైడ్ కి వెళుతుంటారు. నాగచైతన్య స్నేహితుడు కార్తికేయన్ ఫార్ములా వన్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చరణ్ లాంటి స్టార్లు ఆస్టన్ మార్టిన్ కార్ లో రేసింగ్ కి వెళుతూ ఇంతకుముందు కెమెరాకి చిక్కారు. డార్లింగ్ ప్రభాస్ ఇటీవల లంబోర్ఘిణి కార్ ని సొంతం చేసుకున్నారు. ప్రభాస్.. చరణ్ కి హార్స్ రైడింగ్ లో ట్రైనింగ్ ఉంది. మగధీర కోసం చరణ్.. బాహుబలి కోసం ప్రభాస్ ప్రత్యేకించి హార్స్ రైడింగ్ లో శిక్షణ పొందారు.
ఇక కథానాయిక నివేద పెథురాజ్ కి స్కూల్ డేస్ నుంచే ఫార్ములా వన్ రేసింగ్ అంటే విపరీతమైన పిచ్చి అట. ఆ రోజుల్లోనే లెవల్ -1 రేసర్ సర్టిఫికెట్ కూడా సంపాదించింది. ఎనిమిదవ తరగతిలోనే రేస్ కార్లపై మోజు పెంచుకుంది. ఆ ఆసక్తితోనే 2015 లో ఓ స్పోర్ట్స్ కారు కూడా కొన్నాదట. ఈఏయుఈ లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండవ మహిళ నివేధనట. విదేశాల్లో ఉన్నంత కాలం రేసింగ్ ల్లో పాల్గొనే దాన్ని అని తెలిపింది. మన దేశంలో మహిళలకు ఫార్ములా-1..2 పోటీలు లేవు. ఇక్కడ కూడా మహిళలకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని తెలిపింది.
క్రికెటర్లలో ఎం.ఎస్.ధోనీకి బైక్ గ్యారేజి ఉంది. బైక్ రేసింగ్ అంటూ ధోనికి ఎంత ఆసక్తి అన్నది అతడి బయోపిక్ లోనూ చూపించారు. ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోల్లో జాన్ అబ్రహాంకి బైక్ లు ఖరీదైన కార్ లంటే చాలా పిచ్చి. గ్యారేజ్ లో నిత్యం వాటితోనే అతడి టైమ్ పాస్.