Begin typing your search above and press return to search.
చిరు హీరోయిన్.. పాతికేళ్ల వేడుక
By: Tupaki Desk | 14 Sep 2016 1:30 PM GMT80ల్లో తెలుగు ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రాధ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి సరసన 20కి పైగా సినిమాలు చేయడమే కాదు.. తిరుగులేని డ్యాన్సర్ అయిన చిరంజీవికి దీటుగా డ్యాన్సులు చేసి అభిమానుల్ని అలరించింది రాధ. చిరు-రాధ జంటగా చేస్తున్నారంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్టే అన్న నమ్మకముండేది. చిరుతో పాటు అప్పట్లో తెలుగులోని స్టార్ హీరోందరితోనూ ఆడిపాడిన రాధ.. హీరోయిన్ గా డిమాండ్ ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కేరళకు చెందిన రాధ.. రాజశేఖరన్ నాయర్ అనే తమిళుడిని పెళ్లాడింది. వీరి వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ భారీ వేడుక నిర్వహించారు.
ఒకప్పుడు తనతో పని చేసిన నటీనటులు.. దర్శకుల్ని ఆహ్వానించి భారీగానే ఈ వేడుక చేసుకుంది రాధ. భారతీరాజా.. సుహాసిని.. అంబిక లాంటి సెలబ్రెటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్లుగా మారిన రాధ ఇద్దరు కూతుళ్లు కార్తీక.. తులసిలతో పాటు కొడుకు విఘ్నేష్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నాడు. రాధ కూతుళ్లిద్దరూ సినిమాల్లో అడుగుపెట్టినా సక్సెస్ కాలేకపోయారు. కార్తీక ‘జోష్’ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి కొంచెం పేరు తెచ్చుకున్నప్పటికీ తులసి మాత్రం తొలి సినిమా ‘కడలి’తోనే అడ్రస్ లేకుండా పోయింది. రాధ వివాహ వార్షికోత్సవంలో వీళ్లిద్దరి అవతారం చూస్తే ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్లే అని అర్థమవుతోంది. ఇద్దరూ గ్లామర్ కోల్పోయారు. ఐతే ముంబయిలో.. కేరళలో రెస్టారెంట్లు.. రిసార్టులు ఉన్న రాధ ఫ్యామిలీకి ఆర్థికంగా ఏమీ ఢోకా లేదు. వీరికి బ్రిటన్లో సైతం ఓ రెస్టారెంట్ ఉండటం విశేషం.