Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' వాయిదా పై రాధాకృష్ణ ట్వీట్ వైరల్..!
By: Tupaki Desk | 4 Jan 2022 9:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''రాధే శ్యామ్''. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామాని సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మరియు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేయలేమంటూ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఇప్పటికే వాయిదా వేసుకున్నారు. దీంతో ఇప్పుడు సంక్రాంతి రేసులో నిలిచిన 'రాధే శ్యామ్' మీద అందరి దృష్టి పడింది. డార్లింగ్ టీం రిలీజ్ డేట్ పై ఇది వరకే రెండుసార్లు క్లారిటీ ఇచ్చింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెప్పిన సమయానికి సినిమాని పేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెబుతున్నారు.
అయినప్పటికీ 'రాధే శ్యామ్' సినిమా విడుదల మీద అభిమానుల మనస్సులో సందేహాలు అలానే ఉన్నాయి. దీనికి కారణం చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచకపోవడం ఒకటైతే.. అర డజను చిన్న సినిమాలు సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ మెంట్స్ ఇవ్వడం మరొక కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మంగళవారం డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది.
''సమయాలు కఠినమైనవి. హృదయాలు బలహీనంగా ఉన్నాయి. మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి - 'రాధేశ్యామ్' టీమ్'' అని రాధాకృష్ణ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్స్ ఈ ట్వీట్ కు అర్థం ఏంటో అని ఆలోచిస్తున్నారు. ప్రభాస్ సినిమా వాయిదా పడుతోందని దర్శకుడు పరోక్షంగా చెబుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
ఇన్ డైరెక్ట్ గా ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ అవుతుందని ఓ అభిమాని చేసిన ట్వీట్ కు రాధాకృష్ణ కుమార్ స్పందించారు. ''అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అధికారికంగా చెప్తాం'' అని సమాధానమిచ్చారు. దర్శకుడి రిప్లైతో డార్లింగ్ ఫ్యాన్స్ కి కాస్త ఊరట లభించింది. పక్కా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయితే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయాలని.. ప్రభాస్ తో స్పెషల్ ఇంటర్వ్యూలు వదలాలని కోరుతున్నారు.
'రాధే శ్యామ్' చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పామిస్ట్ గా ప్రభాస్ కనిపించనున్నారు. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - జగపతిబాబు - మురళీ శర్మ - సచిన్ ఖేడ్‌కర్ - జయరామ్ - ప్రియదర్శి -ఎయిర్ టెల్ శాషా ఛత్రి - రిద్ది కుమార్ - సత్యన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ - యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ సంస్థలు భారీ బడ్జెట్ తో 'రాధే శ్యామ్' చిత్రాన్ని నిర్మించాయి. వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా దక్షినాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చగా.. హిందీలో మిథున్ మనస్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసారు.
తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలకు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.