Begin typing your search above and press return to search.

అతను సెకండ్ మూవీతోనే పాన్ ఇండియా డైరెక్టర్.. అవుతాడా..?

By:  Tupaki Desk   |   5 Jun 2020 4:00 PM GMT
అతను సెకండ్ మూవీతోనే పాన్ ఇండియా డైరెక్టర్.. అవుతాడా..?
X
ఈ మధ్య కాలంలో మొదటి సినిమా సొంత భాష వరకే రూపొందించినా రెండో సినిమా విషయం వచ్చేసరికి బాషా పరిమితి లేకుండా పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తున్నారు నూతన డైరెక్టర్లు. అలా ప్రయోగం చేసి పాన్ ఇండియా వైడ్ నేమ్ అండ్ ఫేమ్ పొందిన వారిలో సాహో ఫేమ్ సుజీత్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ అని చెప్పాలి. 2018లో 'కేజీయఫ్ - చాప్టర్1, 2019లో సాహో సినిమాలు ప్రత్యేకంగా నిలిచాయి. 'కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ స్థాయి రెట్టింపు కాగా.. 'సాహో' సినిమాతో ఇండియన్ వైడ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా రుజువైంది. అసలు విషయం ఏంటంటే.. అటు కేజీఎఫ్.. ఇటు 'సాహో'.. ఈ రెండు కూడా డైరెక్టర్ల రెండో ప్రయత్నాలే కావడం విశేషం. 2014లో 'ఉగ్రమ్‌' వంటి కన్నడ బ్లాక్‌బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సినిమా కేజీయఫ్. ఇక అదే ఏడాది 2014లో 'రన్ రాజా రన్' లాంటి హిట్ సినిమా తరువాత సుజీత్ రూపొందించిన సినిమా 'సాహో'.

అలా ఒకే ఏడాది డైరెక్టర్లుగా తొలి అడుగేసిన ప్రశాంత్, సుజీత్ ఇద్దరూ కూడా తమ కెరీర్‌లో రెండో సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్లుగా అవతరించారు. ఇక ఇప్పుడు తాజాగా వీరిద్దరి బాటలోనే మరో యంగ్ డైరెక్టర్ తన రెండో సినిమాతోనే పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు.. తెలుగులో గోపీచంద్ హీరోగా 'జిల్' సినిమా రూపొందించి స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రాధాకృష్ణ. ఫస్ట్ హిట్ తర్వాత రెండో సినిమా కోసం భారీ టైం కేటాయించి.. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ హీరోగా తన రెండో సినిమాను రూపొందిస్తున్నాడు. గత జన్మల నేపథ్యంలో పీరియడ్ రొమాంటిక్ మూవీ(ప్రభాస్ 20) తెరకెక్కిస్తున్నాడు రాధాకృష్ణ. ఇప్పటికే పోస్టర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసాడు డైరెక్టర్. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీతో పాటు ఇతర బాషలలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్స్ రేసులో దిగుతున్నాడు రాధాకృష్ణ. మరి తను కూడా ప్రశాంత్ నీల్.. సుజీత్ తరహాలో మ్యాజిక్ చేస్తాడా.. లేక బోల్తా కొడతాడా.. అనేది చూడాలి!