Begin typing your search above and press return to search.
డార్లింగ్ కోసం మూడేళ్ల నిరీక్షణ
By: Tupaki Desk | 26 Aug 2018 4:41 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకుని - ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీ( హైదరాబాద్)లో భారీ షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే `జిల్` ఫేం రాధాకృష్ణతో ప్రభాస్ సినిమా ప్రారంభమవుతుందని ప్రచారమైంది. అన్నీ కుదిరితే ఈపాటికే ప్రారంభం కావాల్సింది. అయితే ఆగస్టులో ఈ సినిమా ప్రారంభం కాదని - అక్టోబర్ వరకూ ఆగాల్సిందేనని తెలుస్తోంది.
అయితే రాధాకృష్ణకు ఇంకెంతకాలం ఈ నిరీక్షణ అనేది ఓ సస్పెన్స్. ఈ సినిమా ఇంతకీ మొదలవ్వదు.. అంతకీ మొదలవ్వదు. ఆగస్టులో లాంచ్ అన్నారు.. ఇప్పుడు నోనో అంటున్నారు. అక్టోబర్ లోనే లాంచ్ ఉంటుందని చెబుతున్నారు. జిల్ చిత్రం 2015లో రిలీజైంది. ఇప్పటికే మూడేళ్లుగా ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాడు రాధాకృష్ణ. డార్లింగ్ కోసమే ఇంత పెద్ద త్యాగం చేశాడని చెప్పొచ్చు.
అయితే ప్రభాస్ తరపున వెర్షన్ వేరొకలా ఉంది. సాహో కోసం డార్లింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఫిజికల్ గానూ స్ట్రెస్ ఎక్కువగానే ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా రిస్క్ చేసి స్టంట్స్ చేయాల్సి వచ్చింది. మునుముందు ఇంకా కీలకమైన షూటింగ్ పెండింగులో ఉంది. అందుకే ప్రభాస్ ఒకేసారి అంత పెద్ద స్ట్రెయిన్ తీసుకోవాలని అనుకోవడం లేదట. అందుకే ఈ ఆలస్యం తప్పదని తెలుస్తోంది. 1960 బ్యాక్ డ్రాప్ లో యూరప్ లో జరిగే అద్భుతమైన ప్రేమకథను తెరపై చూపించనున్నారు రాధాకృష్ణ. యూరప్ లోనే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ సాగనుంది. యు.వి.క్రియేషన్స్- గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.