Begin typing your search above and press return to search.

'రాధ'కి ఇద్దరు భామల ముద్దులు

By:  Tupaki Desk   |   2 May 2017 6:37 AM GMT
రాధకి ఇద్దరు భామల ముద్దులు
X
యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ రాధ. ఉగాది నాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని.. సమ్మర్ రేస్ లోకి మార్చారు. కొత్త కుర్రాడు చంద్రమోహన్ రూపొందిస్తున్న ఈ సినిమా పాటల షూటింగ్ జరుగుతుండగా.. మే 12న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు.

ఇప్పుడు సినిమా రిలీజ్ మరో 10 రోజుల్లోకి వచ్చేయడంతో కొత్త పోస్టర్లతో సందడి చేస్తోంది రాధ టీం. శర్వాను పెళ్లికొడుకు గెటప్ లో.. నుదుటన తిలకం.. పట్టుబట్టల గెటప్ లోనే.. కాసింత రఫ్ గా చూపించారు. అయితే.. పెళ్లి కూతురు గెటప్ లో ఇటు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు.. మరో భామ అక్షతో కూడా హీరోకు ముద్దు పెట్టించేసిన పోస్టర్ ను వదిలారు. ఒక హీరోకు ఇద్దరు భామలతో ముద్దులు పెట్టించడం కొత్తేమీ కాదు కానీ.. అసలు ఇద్దరు భామలతో ఒక కుర్రాడు ఎంజాయ్ చేయడం అనే కాన్సెప్టే బూతుగా ఉంది. ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఒకే కుర్రాడితో ఇద్దరు భామలు రొమాన్స్ చేస్తున్నట్లు కథలు చెబుతారు? ఇవన్నీ యూత్ పై నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయని వేరే చెప్పక్కర్లేదు.

ఈ మధ్యన జ్యోతిక వంటి హీరోయిన్.. ఇలా ఒక హీరోకు ఇద్దరు గాళ్‌ ఫ్రెండ్స్ వంటి కాన్సెప్టులు తీయకండి.. రియల్ లైఫ్‌ లో కూడా అబ్బాయిలు అలానే కావాలని థింక్ చేస్తున్నారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇందుకే. కాని మనోళ్ళు మాత్రం ఆ మూసలోనుండి బయటకు వచ్చేలా కనిపించట్లేదుగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/