Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' రెస్పాన్స్ పై రాధాకృష్ణ అసంతృప్తి..!

By:  Tupaki Desk   |   14 March 2022 4:22 PM GMT
రాధేశ్యామ్ రెస్పాన్స్ పై రాధాకృష్ణ అసంతృప్తి..!
X
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ డ్రామా ''రాధే శ్యామ్''. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విజువల్ గ్రాండియర్ ఉన్నప్పటికీ.. సినిమా మెజారిటీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

'రాధేశ్యామ్' చిత్రానికి ఫస్ట్ డే డివైడ్ టాక్ రావడంతో పాటుగా రివ్యూలు కూడా ఆశాజనకంగా రాలేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనలపై దర్శకుడు రాధాకృష్ణ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచీ ప్రేమకథ అని చెప్తున్నప్పటికీ.. దాన్నుంచి యాక్షన్ ఆశించినందుకు విమర్శకులను తప్పుపడుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. "మీరు చికెన్ బిరియాని కోసం వెజిటేరియన్ హోటల్‌ కి వెళతారా? మేము ఎప్పటినుండో ఇది లవ్ స్టోరీ అని చెప్తూ వస్తున్నాం. కానీ సినిమాలో యాక్షన్ లేదని విమర్శకులు అంటున్నారు. ఇందులోఏమైనా అర్ధం ఉందా?" అని అన్నారు. దీనిని బట్టి 'రాధే శ్యామ్' పై నెగెటివ్ కామెంట్స్ పై రాధాకృష్ణ అప్సెట్ అయినట్లు అర్థం అవుతోంది.

కాగా, ప్రేమకు విధికి మధ్య యుద్ధంగా మేకర్స్ ''రాధేశ్యామ్'' చిత్రాన్ని అభివర్ణించారు. ఇందులో హస్త సాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించారు. కృష్ణంరాజు - భాగ్యశ్రీ - మురళీ శర్మ - సచిన్‌ ఖేడ్‌కర్‌ - జయరామ్ - ప్రియదర్శి - సత్యరాజ్ - కునాల్ రాయ్ క‌పూర్‌ - ఎయిర్ టెల్ శాషా ఛ‌త్రి - రిద్ది కుమార్‌ - స‌త్యన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై వంశీ - ప్రమోద్ - ప్రసీద భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీలో టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు.

రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేశారు. మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్‌.రవీందర్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. 'రాధేశ్యామ్' సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. మరి వీక్ డేస్ లో అదే జోరు కొనసాగిస్తుందో లేదో చూడాలి.