Begin typing your search above and press return to search.

పెద్దాయన కామెంట్స్ తో అట్టుడుకుతున్న కోలీవుడ్

By:  Tupaki Desk   |   25 March 2019 4:11 AM GMT
పెద్దాయన కామెంట్స్ తో అట్టుడుకుతున్న కోలీవుడ్
X
కోలీవుడ్ లో మరోసారి అగ్గి రాజుకుంది. సీనియర్ నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాధారవి ఓ ఆడియో ఫంక్షన్ లో నయనతారను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అక్కడ ఇప్పుడు పెద్ద చిచ్చునే రేపాయి. ఇటీవలే కొలయుత్తిర్ కాలం అనే సినిమా వేడుక ఒకటి జరిగింది. అందులో నయనతార హీరొయిన్. అయితే ఇది ఆగుతూ సాగుతూ చాలా లేట్ గా పూర్తైన ప్రాజెక్ట్. ఒరిజినల్ నిర్మాతలు ఎప్పుడో పక్కకు తప్పుకున్నారు. కేవలం నయన్ ఇమేజ్ ని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు విడుదల చేస్తున్నారు.

సహజంగానే తన రెగ్యులర్ సినిమాలకే రావడానికి ఇష్టపడని నయన్ కు వీళ్ళు ఎలాంటి సమాచారం అందించలేదు. దీనికి గెస్ట్ గా వెళ్ళాడు రాధారవి. వెళ్ళిన పెద్ద మనిషి ఏవో నాలుగు ముక్కలు చెప్పేసి రాకుండా లేనిపోని వివాదం సృష్టించి గందరగోళం సృష్టించాడు

హీరొయిన్ నయనతారను నేరుగా ఉద్దేశించి మాట్లాడిన రాధారవి నయనతార ఇటు దెయ్యంగానూ అటు సీత గానూ ఒకేసారి నటించగలదని ఒకప్పుడు కేఆర్ విజయ లాంటి వాళ్ళు మాత్రమే ఛాయస్ గా ఉండేవాళ్ళని దెప్పి పొడిచాడు. అంతే కాదు చూపులతోనే వలలో వేసుకునే ఎవరితో అయినా సరే ఇప్పుడు దేవతల పాత్రలు వేయించేందుకు దర్శకులు వెనుకాడటం లేదని వెకిలిగా అనడం అందరికి షాక్ కు గురి చేసింది. దీంతో ఇప్పుడు కోలీవుడ్ ప్రముఖులు భగ్గుమంటున్నారు.

రాధారవి వల్లే డబ్బింగ్ సంఘంలో నిషేధానికి గురైన చిన్మయి హీరొయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకుడు కం నయనతార కాబోయే భర్త విజ్ఞేశ్ శివన్ అందరూ ట్విట్టర్ వేదికగా నడిగర్ సంఘం మీద నిప్పులు కురిపించారు. రాధారవి వ్యవహారశైలి మీద తీవ్రవిమర్శలు వస్తున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు రాధారవిని ఇంకెప్పుడు తమ సినిమాల్లో తీసుకోమని శాశ్వత బ్యాన్ విదించాయి. నిరసనలు కొనసాగుతున్నాయి.

విశాల్ సైతం చాలా ఆలస్యంగా స్పందించి ఖండిస్తూ స్టేట్ మెంట్ రిలీజ్ చేశాడు. ఇంత రచ్చకు కారణమైన ఈ సినిమాకు దర్శకుడు మన తెలుగు వాడే. వెంకటేష్ కమల్ హసన్ నటించిన ఈనాడుకు దర్శకత్వం వహించిన చక్రి తోలేటి.