Begin typing your search above and press return to search.
అంత ఘోరమైన నేరం నేనేం చేశాను?:రాధారవి
By: Tupaki Desk | 10 April 2019 5:19 PM GMTకొద్ది రోజుల క్రితం ఒక తమిళ సినిమా ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ నయనతారపై సీనియర్ నటుడు రాధారవి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీలు ఘాటుగా స్పందించారు. ఇక సాధారణ నెటిజనులైతే రాధారవిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎపిసోడ్ తర్వాత డీఎంకే పార్టీ నుండి ఆయనపై సస్పెన్షన్ విధించారు.
ఇదిలా ఉంటే తాజాగా రాధారవి ఒక ఈవెంట్ లో పాల్గొని నోటికి వచ్చినట్టు మాట్లాడి మరోసారి సంచలనం సృష్టించాడు. 'ఎనక్కు ఇన్నోరు ముగం ఇరుక్కు' అనే షార్ట్ ఫిలిం లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాధారవి తన స్పీచ్ ను ఇలా ప్రారంభించాడు "అవును. నేనెవరినైనా బాధపెట్టి ఉంటే నేను అందుకు చింతిస్తున్నానని తెలిపాను. అంతేకానీ నేనెవరినీ క్షమాపణలు కోరలేదు. అలాచేయడం నా బ్లడ్ లోనే లేదు. నేనెందుకు క్షమాపణ కోరాలి? నేనేమైనా ఘోరమైన నేరం చేశానా?"
"నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆడియన్స్.. మీడియా మిత్రులు చప్పట్లు కొడుతున్నారు. నామాటల్లో నిజం లేకుండా ఉంటే ఎందుకు అలా చేస్తారు. ఆరోజు కుడా నాకు ఇలాంటి రెస్పాన్సే వచ్చింది. నేను నిజం కనుక మాట్లాడితే.. జనాలు నన్ను మెల్లగా సపోర్ట్ చేస్తారు. నేను చేసిన వ్యాఖ్యలలో ఏదైనా తప్పు ఉంటే అక్కడే ఉండే నా మిత్రులు అప్పుడే నాకు చెప్పి ఉండేవారు కదా?" అంటూ ప్రశ్నించాడు.
నయనతార ఎపిసోడ్ తర్వాత కొంతమంది రాధారవితో పని చేయమని చెప్పారు. రాధారవిని తమిళ చిత్రసీమ నుండి నిషేధించాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పందిస్తూ "నేనిక సినిమాల్లో నటించలేనని కొంతమంది అంటున్నారు. అలా నన్నెవరూ ఆపలేరు. నేను డ్రామాలు.. స్టేజి షోలను ఎంచుకుంటే అప్పుడేం చేస్తారు? దర్శకుడు పేరరసు ఈమధ్య ఈ వివాదం గురించి భయపడవద్దని నాతో అన్నాడు. నేనెవరికి భయపడే వ్యక్తిని కాదని ఆయనతో చెప్పాను."
"నాకేదైతే జరిగిందో అదేమీ పెద్ద విషయం కాదు.. అది టెంపరరీ ఇష్యూ. నా స్పీచ్ లో ఒకవేళ కొంతైనా నిజం ఉంటే యాక్సెప్ట్ చెయ్యండి. లేకపోతే పట్టించుకోకుండా వదిలెయ్యండి" అంటూ మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. రాధారవి వ్యాఖ్యలు మరోసారి తమిళ చిత్రసీమలో దుమారం రేపుతున్నాయి.