Begin typing your search above and press return to search.
నయనతారకు ఆ హీరోతో సంబంధం ఉందిః సీనియర్ నటుడు
By: Tupaki Desk | 1 April 2021 4:30 AM GMTస్టార్ హీరోయిన్ నయనతారపై తమిళ సీనియర్ నటుడు రాధారవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ తో నయనతార రిలేషన్ కొనసాగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేసినట్టు సమాచారం. బీజేపీ నాయకుడిగా ఉన్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ తరహా కామెంట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
గతంలోనూ నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాధారవి. శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార సీత పాత్రను పోషించడంపై కామెంట్ చేశారు. నయనతార వంటి వాళ్లు కూడా సీత పాత్ర వేస్తున్నారని నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు.. ఏకంగా రిలేషన్ షిప్ ఉందంటూ కామెంట్ చేశారనే ప్రచారం సాగుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో.. ఆయనపై అన్ని వైపుల నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయని చిన్మయి ఈ విషయమై ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది. రాధారవి ప్రవర్తన మాటతీరు చూసి తాను విసిగిపోయానని అన్నట్టు సమాచారం. ఆయన బహిరంగంగానే బూతులు మాట్లాడుతూ.. మహిళలను వేధిస్తుంటారని, ఇలాంటి వాళ్లను పార్టీలు స్టార్ క్యాంపెయినర్ గా ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రాధారవి లాంటి వారికి ఓటు వేయొద్దని ఆమె కామెంట్ చేసినట్టు సమాచారం.
మరోవైపు ఫ్యాన్స్ కూడా రాధారవిపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసే వారిని ఆ పార్టీ ఎలా ఉంచుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.