Begin typing your search above and press return to search.
కూతుళ్ల కోసం హీరోయిన్ ఆపసోపాలు
By: Tupaki Desk | 19 Sep 2015 9:30 AM GMTఅలనాటి మేటి నాయిక, మెగా హీరోయిన్ రాధ ఒకప్పుడు టాలీవుడ్..కోలీవు్డ్ ల్లో టాప్ హీరోయిన్. 90,80 ల లో ఇరు భాషల్లోను హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అందం..అభినయం. లో ఇప్పటికి చాలా మంది హీరోయిన్ లకు ఆదర్శం. మెగాస్టార్ చిరంజీవి సరసన పెర్ఫెక్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. అయితేనేం.. ఈ అమ్మడి నటవారసురాళ్లు మాత్రం ఆ పేరు నిలబెట్టలేకపోయారు. ఇది రాధను ఆందోళనకు గురి చేస్తోందని సమాచారం.
రాధా తనయలు కార్తీక - తులసి నాయికలుగా ఆమె అంచనాలను అందుకోలేకపోయారు. రాధ పేరుతో ఆరంభంలో అవకాశాలైతే అందుకున్నారు గానీ నటన పరంగా నిలదొక్కులేకపోతున్నారు. జోష్ సినిమాతో పెద్ద కూతురు కార్తిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత దమ్ము - బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలతో టాలీవుడ్ కెరీర్ సాగించింది. ఆ తర్వాత ఛాన్సులే లేవ్. అటు చిన్న కూతురు తులసి కోలీవుడ్ లో మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా ప్లాప్ బాటనే పట్టింది. తర్వాత నటించి యాన్ సనిమా పరిస్థితి కూడా అంతే.
దీంతో ఇద్దరు భామలు పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఆరంభమే ఈ భామలకు లక్ ఫేవర్ అవ్వలేదు. అటు మాతృభాషలో అవకాశాలు లేక ఇటు టాలీవుడ్ లోనూ ఛాన్సులు రాక సతమతమవుతున్నారు. అందుకే మళ్లీ రాధ రంగంలోకి దిగాల్సిన టైమ్ వచ్చిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వెండితెరపై తన కుమార్తెలు భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఆమె వెన్నెంటే ఉండాలని సంకల్పిస్తున్నారట. ప్రస్తుతం రాధ ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్..కోలీవుడ్ దర్శక, నిర్మాతలను సంప్రదించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. తను వెలిగిపోతూ .. తన కూతుళ్ల జీవితాల్ని వెలిగించాలనుకుంటోంది ఈ అమ్మ మనసు.