Begin typing your search above and press return to search.
షారూక్ చెప్పిన పంజాబ్ పాట
By: Tupaki Desk | 23 Jun 2017 4:07 AM GMTఒకరు ప్రేమ కథలు చెప్పడంలో ఘనుడైన ఇంతియాజ్ ఆలీ... మరొకరు ప్రేమగా నటించడంలో మహా ముదురు షారూక్ ఖాన్.. వీళ్ళ మధ్యలో పంజాబ్ జాజి మల్లి అనుష్క శర్మ.. వీరందరూ కలిసి వినిపిస్తున్న ప్రేమ కథా చిత్రం ''జాబ్ హ్యారి మెట్ సెజల్''. ఈ సినిమా పోస్టర్ విడుదల అయినప్పుడు సన్నగా మొదలైన సందడి ఇప్పుడు హై వే మీదకు ఎక్కించారు మొత్తం టీమ్. నిన్నే ఈ సినిమాలో ‘రాధ’ పాట టీజర్ విడుదల చేశారు అందులో షారూక్ అనుష్క ఫ్రీ స్టైల్ మాటలు - చేష్టలు చూసే వాళ్ళు ఆ పాత్రలతో తొందరగానే కనెక్ట్ అయ్యారు.
షారూక్ ఇందులో పంజాబ్ సింగర్ల గొంతు ఎందుకు హై పిచ్ లో ఉంటుందో కారణం అనుష్కకు వివరిస్తూ.. ''నీకు పంజాబ్ వాళ్ళు ఎందుకు హెచ్చు గొంతులో పాడతారో తెలుసా? పంజాబ్ రైతులు పొలాలలో పాటలు పాడుకుంటూ పని చేస్తారు. అక్కడే ట్రాక్టర్ శబ్ధాలు ఉంటాయి కాబట్టి వాటిని మించి పాట శబ్ధం వినపడాలి కాబట్టి వాళ్ళకు అలా పాడటం అలవాటు'' అని చెబుతాడు. చెబుతూ పాట మొదలుపెడతాడు. ప్రేమ పక్షులుకు ఎటువంటి విహంగాలు కోరుకుంటాయో అలానే షారూక్ అనుష్కల మధ్య సన్నివేశాలుతో సాగుతుంది మొత్తం పాట ఫుల్ బిందాస్ తరహాలో. చివరిలో అనుష్క ముగింపు పలుకుతుంది 'చాల సాదా రాధ లాగా'. దానికి షారూక్ పాత్రను పరిచయం చేసే విదంగా తన మాటలుతో నైస్ , స్వీట్ కానీ కొంచం ‘గరమ్’ ఉంటే బాగున్ను అని అంటాడు. వీళ్ళ కెమిస్త్రీ ఇప్పుడు అభిమానులుకు మంచి కిక్ ఇచ్చింది అనే చెప్పాలి.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ‘జాబ్ హ్యారి మెట్ సెజల్’ను ఇంతియాజ్ ఆలీ డైరెక్ట్ చేస్తున్నాడు. షారూక్, అనుష్క హీరో హిరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ రాధ పాటను సుఖ్విందర్ సింగ్, సునిధి చౌహాన్ పాడారు. ఆగష్టు 4 నాడు విడుదల అవుతుంది వీళ్ళ ప్రేమ కథ. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/