Begin typing your search above and press return to search.

18 ఏళ్లుగా ఈ కథ ప్రభాస్ కోసం వెయిట్ చేసిందంతే!

By:  Tupaki Desk   |   1 Jan 2022 6:31 AM GMT
18 ఏళ్లుగా ఈ కథ ప్రభాస్ కోసం వెయిట్ చేసిందంతే!
X
ప్రభాస్ - పూజ హెగ్డే కాంబినేషన్లో 'రాధే శ్యామ్' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ .. "ప్రభాస్ సినిమా కనుక సహజంగానే అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. అలా అని చెప్పేసి నాకు టెన్షనేమీ లేదు. ఈ సినిమాను వాళ్ల ముందుకు ఎప్పుడు తీసుకువెళతానా అనే ఒక ఎగ్జైట్ మెంట్ ఉంది.

ఈ సినిమాలో రాయల్ ఫ్యామిలీస్ కి జాతకాలు చెప్పే పాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ కథ ద్వారా ఒక ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా ఇది ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. కథా పరంగా .. పాత్రల పరంగా .. విజువల్స్ పరంగా .. సౌండ్ పరంగా ఆడియన్స్ కొత్త ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు. కథ మొదటి నుంచి చివరి వరకూ విన్న తరువాతనే ప్రభాస్ ఓకే చేశారు. అలాంటి ఈ కథకి 18 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటిసారి ఈ పాయింట్ ని నేను మొదటిసారిగా మా గురువుగారు చంద్రశేఖర్ యేలేటి గారి దగ్గర విన్నాను.

ఆయన దగ్గర నుంచి ఆ పాయింట్ తీసుకుని పెద్ద పెద్ద రైటర్లను పిలిపించి అది చేశాం .. ఇది చేశాం .. ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఎలా చెప్పి ఈ కథను ముగించాలనేది మాత్రం సవాలుగా మారింది. అప్పుడు చంద్రశేఖర్ ఏలేటి గారు ఇది ఇక వర్కౌట్ అయ్యేలా లేదు .. ఇది ఎవరికి రాసిపెట్టుందో అని పక్కన పెట్టేశారు. ఆ తరువాత మళ్లీ ఆ పాయింట్ ను తీసుకుని నేను కొన్ని మార్పులు చేశాను. అప్పుడు ఆయన ఇది ప్రభాస్ కి రాసి పెట్టుందేమో అని అన్నారు. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఒక కామన్ ఆడియన్ గా ఆయనను తెరపై నేను ఎలా చూడాలని అనుకుంటున్నానో అలాగే చూపించాను.

ఇది క్లాస్ గా కనిపించే మాస్ మూవీ .. మాస్ ఆడియన్స్ కి తేలికగా అర్ధమయ్యే మూవీ. 'సాహో' సినిమా ముగింపు దశలో ఉండగా ఈ సినిమా పనులను మొదలుపెట్టాము. ఆ తరువాత కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇటలీలో ఉన్నప్పుడు మా అందరికీ కోవిడ్ వచ్చింది. మేము తిరిగి వచ్చేవరకూ ఇంట్లో వాళ్లకి కూడా చెప్పలేదు .. కంగారు పడతారని. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ఖాళీగా ఉండటమనేది ఎప్పుడు ఊహించను కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్లగలుగుతామా లేదా? అని కూడా అనుకునేవాళ్లం. అలా ఈ సినిమా కోసం ఒక టఫ్ జర్నీ చేశాము" అని చెప్పుకొచ్చాడు.