Begin typing your search above and press return to search.
#రాధే .. సల్మాన్ భాయ్ కి 100 కోట్ల ప్రాఫిట్
By: Tupaki Desk | 21 May 2021 8:30 AM GMT`ఈద్` కానుకగా సల్మాన్ ఖాన్ నటించిన రాధే -యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ థియేటర్లలో ఓటీటీలో ఏకకాలంలో రిలీజైన సంగతి తెలిసిందే. జీప్లెక్స్ లో పే-పర్ వ్యూ విధానంలో రిలీజైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కూడా యథావిధిగా మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ సినిమా వల్ల సల్మాన్ ఖాన్ కి లాభమా? నష్టమా? అని ప్రశ్నిస్తే.. ఆయన 100కోట్లు ఖాతాలో వేసుకుని సేఫ్ గేమ్ ఆడారని ట్రేడ్ చెబుతోంది. ఈ సినిమాని జీ సంస్థకు 230కోట్లకు అమ్మారు. కానీ ఆ తర్వాత సవరించిన ధరతో 190 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఏకంగా 40కోట్ల మేర తగ్గింపు తో డీల్ పూర్తి చేసారు. ఈ డీల్ తో లాభనష్టాలన్నిటినీ జీ సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ నిర్మాణ సంస్థ 90కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసింది. అంటే మిగతా 100కోట్లు లాభం అన్నమాట.
రాధే వల్ల జీ స్టూడియోస్ కు లాభమా నష్టమా? అంటే.. వాళ్లకు కూడా ఎలాంటి నష్టం లేదు. ఇది లాభదాయకమైన ప్రాజెక్టుగా నిలుస్తోందట. దాదాపు 40 దేశాల్లో ఈ చిత్రం రిలీజైంది. ఇండియాలో సెకండ్ వేవ్ వల్ల పరిమిత థియేటర్లలో విడుదలైంది.