Begin typing your search above and press return to search.
‘రాధే’.. గోవిందా..
By: Tupaki Desk | 16 May 2021 3:30 PM GMTకరోనా మహమ్మారి పీక్ స్టేజ్ కు చేరినా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల్సిందేనని ‘రాధే’ చిత్రాన్ని ఈద్ కు పట్టుకొచ్చాడు సల్మాన్. దీనికోసం పక్కా కాలిక్యులేషన్స్ వేశారు మేకర్స్. ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఓటీటీ అండ్ థియేటర్ అన్నప్పటికీ.. ఇండియాలో థియేటర్లు మూసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఇంటర్నేషనల్ మార్కెట్ కోసమే.. ఇండియాలోనూ థియేటర్ అనే పదాన్ని వాడేశారు.
మొత్తంగా.. భారత్ లో ఈ చిత్రం ఓటీటీలోనే రిలీజ్ అయినట్టు లెక్క. అయితే.. ఓటీటీ సంస్థకు సినిమాను అమ్మేసుకోవడం కాకుండా.. పే పర్ వ్యూ పద్ధతిని రన్ చేస్తున్నారు. రేటు వచ్చేసి రూ.249. ఆ విధంగా టిక్కెట్ కొనుక్కుని, ఇంట్లో కూర్చొని సినిమా చూడాలని చెప్పారు. కానీ.. ఫస్ట్ డేనే టాక్ స్ప్రెడ్ అయిపోయింది.
సల్మాన్ ఫ్యాన్స్ కూడా అరరే.. ఇలాంటి సినిమా పడిందేంటీ అనుకుంటున్నారట. ఇక, విమర్శకులకు చెప్పాల్సింది ఏముంటుందీ? ‘ఇట్స్ వరస్ట్ కా బాప్’ అంటున్నారు. దీంతో.. సినిమాపై హైప్ అమాంతం పడిపోయింది. ఇక, పైరసీ గురించి చెప్పాల్సిన పనిలేదు.. రిలీజ్ రోజే సాయంత్రం కల్లా ఆన్ లైన్లో లింక్ ప్రత్యక్షమవుతోంది.
దీంతో.. ఓటీటీ అయినా ఫోన్లోనే.. పైరసీ అయినా ఫోన్లోనే.. ఆ మాత్రం దానికి డబ్బులు బొక్క ఎందుకు అనుకుంటున్న చాలా మంది ఆడియన్స్.. పైరసీకే ఓటేస్తున్నట్టు సమాచారం. కొవిడ్ ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో బడా ఇండియన్ చిత్రం ఏదీ రిలీజ్ కాలేదు. కాబట్టి.. ఈద్ సందర్భంగా సల్మాన్ సినిమా రిలీజ్ చేస్తే బాగానే ఉంటుందని అంచనా వేశారు మేకర్స్.
సినిమా బాగుంటే.. అటు థియేటర్ ద్వారా.. ఇటు ఓటీటీ ద్వారా వచ్చే వసూళ్లతో వాళ్లు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేవాళ్లే. కానీ.. బొమ్మే తేడా కొట్టేయడంతో.. పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు. మరి, కలెక్షన్ కండీషన్ ఏంటనేది త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.