Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ సినిమా మొదటి రోజు వసూళ్లు ఛారిటీకి
By: Tupaki Desk | 7 May 2021 3:30 AM GMTబాలీవుడ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రాధే' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయినా కూడా రాధే సినిమా ను రంజాన్ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. థియేటర్ రిలీజ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను ఓటీటీ ద్వారా పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేస్తున్నారు. ఈ సమయంలో ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు వెళ్లే అవకాశం ఎలాగూ లేదు. కనుక పే ఫర్ వ్యూ పద్దతిన భారీగా చూసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను జీప్లెక్స్ ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ సినిమా తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా ద్వారా వచ్చిన మొదటి రోజు వసూళ్లను కరోనా పై యుద్దంలో భాగంగా ప్రభుత్వంకు మరియు స్వచ్చంద సంస్థలకు విరాళంగా ఇచ్చేయనున్నట్లుగా పేర్కొన్నారు. సల్మాన్ సినిమా అంటే ఖచ్చితంగా మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం. థియేటర్లకు జనాలు వెళ్లకున్నా ఓటీటీ లో మాత్రం ఈ సినిమా ను పే ఫర్ వ్యూ పద్దతిన భారీగా చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కనుక పాతిక కోట్లకు మించి మొదటి రోజు వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక సల్మాన్ టీమ్ ఈ సమయంలో చాలా భారీ విరాళంను ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
రాధే సినిమా లో తెలుగు పాట సిటీమార్ ను రీమిక్స్ చేయడం జరిగింది. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఏకంగా వంద మిలియన్ ల వ్యూస్ ను ఆ పాట దక్కించుకుంది. పాట తో పాటు సల్మాన్ ఖాన్ ఆ పాటలో వేసే స్టెప్పులు కూడా అభిమానులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఆ పాటతో రాధే సినిమా పై మాస్ ఆడియన్స్ లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఉత్తరాదితో పాటు దక్షిణ భారతంలో కూడా రాధే సినిమా కోసం సల్లూ భాయ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.