Begin typing your search above and press return to search.

హ‌మ్మ స‌ల్మానూ.. నీ ప్లాన్‌ ఇదా?

By:  Tupaki Desk   |   12 May 2021 4:30 AM GMT
హ‌మ్మ స‌ల్మానూ.. నీ ప్లాన్‌ ఇదా?
X
క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు దేశ‌వ్యాప్తంగా సినిమా ఇండ‌స్ట్రీ మూత‌ప‌డింద‌నే చెప్పాలి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు అని ప‌రిశ్ర‌మ‌ల్లో చిత్రాల రిలీజులు నిలిచిపోయాయి. థియేట‌ర్లు ఎప్పుడో మూత‌ప‌డ్డాయి. చివ‌ర‌కు షూటింగులు కూడా ప్యాక‌ప్ చెప్పేశాయి. దాదాపు స‌గం దేశం లాక్ డౌన్లో ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెద్ద సినిమా ఏదీ కూడా రిలీజ్ చేయ‌డానికి ధైర్యం చేయ‌లేదు. చేసే అవ‌కాశ‌మే లేదు. కానీ.. ఈ కండీష‌న్లో కూడా ఓ బ‌డా చిత్రం రిలీజ్ కాబోతోంది. అదే.. స‌ల్మాన్ ఖాన్ ‘రాధే’.

రంజాన్ సందర్భంగా రేపు (మే 13) రిలీజ్ కాబోతోంది. చాలా మందికి ఈ స్ట్రాట‌జీ అర్థం కాలేదు. ఇదేం పిచ్చిప‌ని అనుకుంటున్నారు చాలా మంది. దేశం మొత్తంలో దాదాపుగా థియేట‌ర్లు మూసేసిన వేళ ఈ సినిమాను థియేట్రిక‌ల్ రిలీజ్ చేసుకొని ఏం చేస్తారు? అనేది చాలా మందికి అంతుచిక్క‌లేదు.

ఇక‌, ఈ సినిమాను థియేట‌ర్ తోపాటు ఓటీటీలోనూ రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దేశం మొత్తం థియేట‌ర్లు మూత‌ప‌డిన వేళ‌.. ఇక ఓటీటీలోనే సినిమా చూడాల్సి ఉంటుంద‌ని అనుకుంటున్నారు. ఈ మాత్రం దానికి థియేట్రిక‌ల్ రిలీజ్ ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. అస‌లు స్ట్రాట‌జీ ఇక్క‌డ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

కరోనా కార‌ణంగా మ‌న దేశంలో థియేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డిన విష‌యం వాస్త‌వ‌మే. కానీ.. విదేశాల్లో కాదు. ఈ ప‌రిస్థితి మ‌రే దేశంలోనూ లేదు. కాబ‌ట్టి.. టార్గెట్ మొత్తం ఓవ‌ర్సీస్ అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. బాలీవుడ్ చిత్రాల‌కు అమెరికా నుంచి గ‌ల్ఫ్ దాకా.. చాలా దేశాల్లో మంచి మార్కెట్టే ఉంది. సో.. స‌ల్మాన్ దృష్టి మొత్తం రెస్టాఫ్ ఇండియా మీద‌నే ఉంద‌ని తెలుస్తోంది.

మొద‌టి ద‌శ క‌రోనా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు భారీ చిత్రం ఏదీ కూడా విదేశాల్లో రిలీజ్ కాలేదు. అందువ‌ల్ల‌.. ‘రాధే’కు మంచి వసూళ్లు వస్తాయనే అంచనాలో ఉంది యూనిట్. ఇక‌, ఆయా దేశాల్లో జ‌నాలు థియేట‌ర్ కు రావ‌డానికి పెద్ద‌గా సంకోచించాల్సిన ప‌రిస్థితి లేదు. కాబ‌ట్టి.. వారి అటెన్ష‌న్ గ్రాబ్ చేయ‌డానికే థియేట్రిక‌ల్ రిలీజ్ అనౌన్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఫైన‌ల్ గా చెప్పాలంటే.. ఇండియాలోని వారికి ఓటీటీలో.. ప్ర‌పంచంలోని ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్లో బొమ్మ చూపించాల‌నే ఈ ప్లాన్ వేశాడ‌ట స‌ల్లూ భాయ్‌. అది కూడా.. ఈద్ వేళ కావ‌డంతో మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, రాధే ఎలాంటి ఫ‌లితం న‌మోదు చేస్తుందో చూడాలి.