Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' ఫస్ట్ డే..79 కోట్లతో రికార్డు గ్రాస్!
By: Tupaki Desk | 12 March 2022 3:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన `రాధేశ్యామ్` ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాలతో భారీ హైప్ తీసుకొచ్చిన సినిమా అదే అంచనాలతో నిన్నటి రోజున రిలీజ్ అయింది. పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అయినా సినిమా `బాహుబలి` వసూళ్లని సైతం కొల్లగొడుతుందని ఒకానొక దశలో ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో బజ్ క్రియేట్ అయింది.
ఏపీలో కొత్త జీవో అమలులోకి రావడంతో వసూళ్ల పరంగాను కలిసొచ్చే అంశంగా మారింది. మరి ఇలాంటి అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా తొలి రోజు ఎలాంటి వసూళ్లు సాధించిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
నిన్నటి రోజున భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన బాక్సాఫీస్ ని షేక్ చేసే వసూళ్లతోనే తొలి రోజుని ముగించింది. శుక్రవారం ఒక్క రోజే సినిమా 79 కోట్ల గ్రాస్ వసూళ్లతో రికార్డు సృష్టించింది. విజువల్ వండర్ గా రిలీజ్ అయిన సినిమాకి ప్రేక్షకులు మొదిటి రోజు బ్రహ్మరధం పట్టినట్లు తెలుస్తోంది.
ఓపెనింగ్స్ పరంగా ఎక్కడా ఎలాంటి ఢోకా లేకుండా రాబట్టిందని గ్రాస్ లెక్కని బట్టే తెలుస్తోంది. కరోనా పాండమిక్ అనంతరం మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా `రాధేశ్యామ్` బాక్సాఫీస్ వద్ద నిలిచింది.
దీన్ని సాలిడ్ ఫిగర్ గానే చెప్పాలి. ఇప్పటివరకూ తెలుగు సహా బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ రేంజ్ వసూళ్లను తొలి రోజు ఏ సినిమా అందుకోలేదు. ఆ రకంగా `రాధేశ్యామ్` మొదటి రోజు రికార్డు కొన్నాళ్లు పాటు పదిలమనే చెప్పొచ్చు. సినిమా విజువల్ ట్రీట్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్కి ఇంకా సమయం ఉంది. ఇప్పట్లో ఇతర హీరోల సినిమాలు కూడా రిలీజ్ కి లేవు. ఇవన్నీ `రాధేశ్యామ్` కి కలిసొచ్చే అంశాలు. వసూళ్ల పరంగా కొన్ని రోజుల పాటు ఎలాంటి ఢోకా ఉండదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పిరియాడిక్ లవ్ స్టోరీ.. సినిమా గ్రాండియర్ లుక్ ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించే అవకాశం ఉంది. వెండి తెరపై సరికొత్త ప్రభాస్ ని చూసుకునే అరుదైన అవకాశం ప్రేక్షకాభిమానులకు ఇప్పుడొచ్చింది. సినిమాపై కాస్త నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ పోటీగా సినిమాలు లేవు కాబట్టి ఆ ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు.
సినిమాలో పూజాహెగ్డే గ్లామరస్ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి `జిల్` ఫేం రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే.