Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్ కోసం ఓ కొత్త డేట్.. కాని డౌటే!
By: Tupaki Desk | 16 Jan 2022 7:30 AM GMTప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో రూపొందిన రాధేశ్యామ్ చిత్రం సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా థర్డ్ వేవ్ వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. సమ్మర్ లో సినిమా ను సరైన సమయంలో విడుదల చేస్తాం అంటూ మేకర్స్ ప్రకటించి సంక్రాంతి విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు. సంక్రాంతికి విడుదల కాలేక పోయిన రాధే శ్యామ్ సినిమాను మార్చి నెలలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రాధేశ్యామ్ కు అనుకూలమైన సమయంగా మార్చి 17వ తేదీని యూవీ క్రియేషన్స్ వారు భావిస్తున్నారట.
మార్చిమొదటి లేదా రెండవ వారం వరకు కరోనా థర్డ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వస్తుందని.. మళ్లీ సాదారణ జనజీవనం కొనసాగించే అవకాశం మార్చి మొదటి వారం నుండే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాధేశ్యామ్ ను మార్చి 17వ తారీకున విడుదల చేయాలని ఇప్పటి నుండే రాధే శ్యామ్ మేకర్స్ భావిస్తున్నారట. ఏప్రిల్ లో చాలా సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. కనుక సరైన సమయం కోసం వెయిట్ చేస్తే మూడు నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే రాధేశ్యామ్ సినిమాను మరీ ఆలస్యం చేయకుండా మార్చిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.
మార్చి మొదటి లేదా రెండవ వారంకు పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి థియేటర్ల వద్ద పరిస్థితి సాదారణంగా ఉండి నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతలు ఉంటేనే రాధేశ్యామ్ ను విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. అప్పటి వరకు అన్ని అదుపులోకి వస్తాయని వారు భావిస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి ఏదో ఒక విషయంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కరోనా వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మార్చి లో సినిమా విడుదల కు అన్ని సహకరించాలని ప్రభాస్ అభిమానులు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టి ఉంటారు. మరి వారి ప్రార్థనలు ఎంత వరకు సఫలం అవుతాయి అనేది చూడాలి.