Begin typing your search above and press return to search.
'రాధే శ్యామ్' క్లైమాక్స్ కోసం భారీ వ్యయంతో ప్రత్యేకమైన సెట్..!
By: Tupaki Desk | 11 Nov 2020 12:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్ - ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ టీజర్ అంచనాలు పెంచేసాయి. కరోనా నేపథ్యంలో ఇటీవలే ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. దీని కోసం భారీ వ్యయంతో ప్రత్యేకమైన సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం.
'రాధే శ్యామ్' క్లైమాక్స్ కోసమే 30 కోట్లతో ప్రత్యేకమైన సెట్స్ నిర్మిస్తున్నారట. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' చిత్రీకరణకు దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ అవుతోందట. పాన్ ఇండియా లెవల్లో తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. హిందీ వర్షన్ ని టీ - సిరీస్ వారు రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న 'రాధేశ్యామ్' ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 'రాధే శ్యామ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్యశ్రీ - కునాల్ రాయ్ కపూర్ - సచిన్ ఖేడ్కర్ - మురళి శర్మ - శాషా ఛత్రి - ప్రియదర్శి - రిద్దికుమార్ - సత్యాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.