Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్' వాళ్ల‌కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా!

By:  Tupaki Desk   |   13 March 2022 4:30 AM GMT
రాధేశ్యామ్ వాళ్ల‌కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా!
X
ఇటీవ‌లే ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` భారీ అంచ‌నాల మధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట రోజే సినిమా భారీ గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి రికార్డు చిత్రంగా నిలిచింది. వ‌ర‌ల్డ్ వైడ్ 79 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాండ‌మిక్ త‌ర్వాత భారీ వ‌సూళ్లు తెచ్చిన తొలి చిత్రంగా `రాధేశ్యామ్` నిలిచింది. ప్ర‌స్తుతం మార్కెట్ లో పోటీగా సినిమాలు కూడా లేవు.

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అవ్వ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి ఈగ్యాప్ లో `రాధేశ్యామ్` దూకుడు అలా నెమ్మ‌దిగా కొన‌సాగుతుంది. ఏపీలో టిక్కెట్ ధ‌ర‌లు కూడా పెరిగాయి కాబ‌ట్టి ఆ అంశం `రాధేశ్యామ్` వ‌సూళ్ల విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

ఇక సినిమా మొద‌టి నుంచి విజువ‌ల్ వండ‌ర్ గానే హైలైట్ అయిన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్..ట్రైల‌ర్..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఇలా ప్ర‌తీది సినిమాకి సంబంధించి సినిమాలో క్లాస్ విజువ‌ల్ అంశాన్నే హైలైట్ చేసింది. సినిమా చూసిన త‌ర్వాత ఆ సంగ‌తి ప్రేక్ష‌కాభిమాన‌ల‌కు అర్ధ‌మైంది. భారీ యాక్ష‌న్ కూడా ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది గానీ..దానికి ఎంత మాత్రం స్కోప్ లేదు. పూర్తి పిరియాడిక్ లవ్ స్టోరీనే విజువ‌ల్ గా అందంగా చూపించే ప్ర‌య‌త్నం చేసారు.

ఆ ర‌కంగా `రాధేశ్యామ్` టాప్ క్లాస్ మూవీ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌తీ సీన్..ప్ర‌తీ ఫ్రేమ్ ఒక అంద‌మైన పెయింట్ లా అనిపించింది. సినిమాలో ప్ర‌తీ సెట్ ఎంతో హైలైట్ అయింది. కెమెరా.ఆర్ట్ వ‌ర్క్..మ్యూజిక్..సౌండ్ డిజైన్ ఇలా సాంకేతికంగా సినిమా హై స్టాండ‌ర్స్డ్ లో నే ఉంది. టెక్నిక‌ల్ గా టీమ ఎపెర్ట్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అయితే సినిమాకి ఇవ‌న్నీ సెకెండ‌రీ. ఏ సినిమానైనా ముందుకు న‌డిపించేవి..ప్రేక్ష‌కుడుని సీటు కూర్చోబేట్టేవి క‌థ‌..క‌థ‌నాలే. వాటిలో ఎక్క‌డా తేడా చేసి మిగ‌తా వాటిని హైలైట్ చేయాల‌ని చూస్తే చేతుల కాల్చుకున్న‌ట్ల‌.

`రాధేశ్యామ్` విష‌యంలో అదే త‌ప్పు జ‌రిగింద‌ని మాట్లాడుకుంటున్నారు. ప్ర‌భాస్ మాస్ ఇమేజ్ ని కొంత వ‌ర‌కూ క్యారీ చేయ‌గ‌లిగినా సినిమాకి ప్ల‌స్ గా మారేది. కానీ ద‌ర్శ‌కుడు వాటిపై ఏ మాత్రం దృష్టిసారించిన‌ట్లు క‌నిపించ‌లేదు. కేవ‌లం హంగుల‌తోనే ప్రేక్ష‌కుడిని ఎంగేజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే ముందుకు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. నిజానికి సినిమా రిలీజ్ కి ముందు నుంచి అలాగే ప్ర‌మోట్ చేసారు. య‌క్ష‌న్ అంశాలుంట‌య‌ని పబ్లిసిటీ లో భాగంగా ఓ మాట వేసినా వాటికి ఎక్క‌డా స్కోప్ లేద‌ని విశ్లేష‌కులు టీజ‌ర్..ట్రైల‌ర్ స‌మ‌యంలోన అంచ‌నా వేసారు.

కామ‌న్ ఆడియ‌న్ ఆ విష‌యంలో కాస్త డైలమా లో ప‌డినా క‌థ క‌థ‌నాల్ని మించి సాంకేతిక హంగులే హైలైట్ అయ్యాయి అన్న విష‌యం అర్ధం చేసుకోవ‌డానికి క‌స్త స‌మ‌యం ప‌ట్టంది. అయితే డివైడ్ టాక్ నేప‌థ్యంలో ఓ వ‌ర్గం డియ‌న్స్ సినిమాని బాగానే ఆస్వాద‌న చేస్తున్నారు. క్లాస్ అంశాలు..విజువ‌ల్ మూవ్ మెంట్స్ ని ఇష్ట‌ప‌డే వారికి సినిమా బాగా న‌చ్చుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

హాలీవుడ్ స్టాండ‌ర్స్డ్ కోరుకునే వారికి `రాధేశ్యామ్` ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పొచ్చు. సాంకేతికంగా సినిమా ని హైలైట్ చేయాల‌నుకున్న‌ప్పుడు కోట్ల రూపాయల ఖ‌ర్చు త‌ప్ప‌దు. ఆ విష‌యంలో యూవీ క్రియేష‌న్స్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రాజీ లేని నిర్మాణంతో.. సినిమాపై ఫ్యాష‌న్ తో కోట్లు ఖ‌ర్చు చేసారు. ఆ రకంగా యూవీ నిర్మాత‌లు త‌మ బ్రాండ్ ని మ‌రోసారి చాటుకున్నారు.