Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్.. ఇది పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్
By: Tupaki Desk | 28 Feb 2022 9:33 AM GMTఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ రాధేశ్యామ్ సినిమా విడుదలకు రెండు వారాల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ హడావుడి మొదలు పెట్టారు. సినిమా పై అంచనాలు పెంచేలా ఆహా ఓహో అంటూ ప్రచారం చేయకుండా సింపుల్ గా సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేలా కాస్త విభిన్నంగా పబ్లిసిటీని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాను ఉత్తరాదిన టీ సిరీస్ వారు భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు. అందుకే దేశంలో భారీ ఎత్తున సింగిల్ స్క్రీన్స్ మరియు మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ ను వారు బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల పాటు అత్యధిక థియేటర్లోల ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యేలా వారు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి ఉంచారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో రాధేశ్యామ్ కు సంబంధించిన హోర్డింగ్స్ మరియు ప్లెక్సీలు ఎక్కడ చూసినా కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ పై రాధేశ్యామ్ స్టిక్స్ ను వేశారు. పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్ అంటే ఇది అంటూ అభిమానులు ఢిల్లీ మెట్రో ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇటీవలే దేశ వ్యాప్తంగా అనేక మల్టీ ప్లెక్స్ మరియు ఈ సినిమా విడుదల కాబోతున్న థియేటర్ల వద్ద జ్యోతిష్యంకు సంబంధించిన విషయాలను తెలియజేసేలా కొన్ని పోస్టర్స్ ను కూడా ఉంచడం జరిగింది.
రాధేశ్యామ్ సినిమాకు విభిన్నంగా పబ్లిసిటీ చేస్తూ హైప్ క్రియేట్ చేయడం కాకుండా సినిమా ను సింపుల్ గా జనాల వద్దకు తీసుకు వెళ్లేలా వీరి ప్రమోషన్స్ ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే సినిమా కు విపరీతమైన బజ్ ఉంది. ప్రమోషన్ హడావుడి చేసి ఇంకా సినిమా కు హైప్ తీసుకు రావడం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
రాధేశ్యామ్ లో విక్రమాధిత్య పాత్రలో జ్యోతిష్యుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. రాధేశ్యామ్ నుండి ఇటీవల వచ్చిన ఈరాతలే వీడియో సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ఉండబోతుందని ఈ పాటను చూస్తుంటేనే అర్థం అవుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా విడుదల విషయంలో ఎన్నో సార్లు వాయిదాలు వేశారు. కాని ఈ మార్చి 11న విడుదల నూరు శాతం పక్కా. దాదాపు మూడు నాలుగేళ్ల ఎదురు చూపులకు బ్రేక్ పడబోతుంది.