Begin typing your search above and press return to search.

రాధే శ్యామ్ మ్యూజిక్ లాంచ్ స్పెష‌ల్ ప్లాన్స్

By:  Tupaki Desk   |   3 Nov 2021 3:42 AM GMT
రాధే శ్యామ్ మ్యూజిక్ లాంచ్ స్పెష‌ల్ ప్లాన్స్
X
ప్రభాస్- పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. జనవరి 14న ఈ సినిమా పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత‌ భారీగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హిందీలోనూ భారీగా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే ఈ ప్రేమ‌క‌థా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు టీజ‌ర్ గ్లింప్స్ ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం అభిమానులు పాటల విడుద‌ల‌ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా సస్పెన్స్ ని కొన‌సాగిస్తున్నారు. హిందీ- తెలుగు రెండు వెర్షన్లలో విభిన్నమైన పాటలు ఉంటాయని తెలిసిన విషయమే. మునుముందు తెలుగు మ్యూజిక్ లాంచ్ కి ఒక వేదిక‌... హిందీ ఆడియో లాంచ్ కి మ‌రో వేదిక ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ పాటలను లాంచ్ చేయడానికి మేకర్స్ ప్రత్యేక ప్లాన్ ని సిద్ధం చేశారు. ఒక్కో పాట ఒక్కో విధంగా లాంచ్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. అంటే పాట‌ల లాంచ్ తో అధికారికంగా ప్ర‌చారాన్ని ప్రారంభించార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. హిందీ వెర్షన్ కి అమల్ మల్లిక్- మిథూన్ కంపోజ్ చేశారు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రేమ‌క‌థ‌

రాధేశ్యామ్ కోసం ప్ర‌భాస్ దాదాపు 11ఏళ్ల త‌ర్వాత ప్రేమికుడిగా మారారు. ఇన్నాళ్లు యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో అల‌రించిన డార్లింగ్ ఈసారి వీర ప్రేమికుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్ని స్ప‌ర్శించ‌నున్నాడు. రాధేశ్యామ్ ప్రేమ‌క‌థ ఆద్యంతం ట్విస్టుల‌తో రంజింప‌జేయ‌నుంద‌ని స‌మాచారం. 1970-90 కాలం నాటి ల‌వ్ స్టోరీతో సాగే పీరియాడిక్ చిత్రమిది. చిత్రీక‌ర‌ణ అంతా ఆ కాలానికి సంబంధించిన ప్ర‌త్యేక‌మైన సెట్ల‌లో సాగింది. అయితే ప్ర‌ధానంగా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీ..రోమ్..వెనీస్ వంటి అంద‌మైన న‌గ‌రాల్లో జ‌రిగింది. ఇంకా ఇండియాలో షూట్ ని ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్లో..నాటి హెరిటేజ్ క‌ల్చ‌ర్ ని స్ఫురించే అన‌వాళ్ల మ‌ధ్య‌నే జ‌రిపారు.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ కావ‌డంతో యూనిట్ ఆ న‌గ‌రాల్ని.. ప్ర‌దేశాల్ని టార్గెట్ గా చేసి చిత్రీక‌ర‌ణ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అలాగే భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గా నిలుస్తాయ‌ని యూనిట్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అస‌లు ఇంత‌కీ ఇట‌లీ..రోమ్ లాంటి న‌గ‌రాల్ని ప్ర‌త్యేకంగా ఎందుకు? టార్గెట్ చేసిన‌ట్లు అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలుస్తున్నాయి. ఇట‌లీ..రోమ్ వంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే 1970-90 కాలం నాటి అన‌వాళ్లు ఉన్నాయి. చ‌రిత్ర పుట్ట‌ల్లోకి వెళ్తే ఆ న‌గ‌రాల గొప్ప‌త‌నం ఎంతో ఉంది. స‌హ‌జంగానే అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ న‌డుమ విదేశీయులు చ‌రిత్ర ఆన‌వాళ్ల‌ను క‌ప్పిపుచ్చ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డరు.

ఆయా ప్ర‌దేశాల్ని టూరిస్ట్ ప్లేస్ లుగా.. మ్యూజియ‌మ్ లు గా మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు త‌ప్ప‌..ప్ర‌సిద్ధ‌ క‌ట్ట‌డాల్ని కూల‌దోయ‌డానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డరు. అలాంటి గొప్ప‌ద‌నం ఇట‌లీ..రోమ్.. వెనీస్ న‌గ‌రాల్లో ఇప్ప‌టికీ క‌నిపిస్తుంది. అందుకే ఆ న‌గ‌రాల్ని ఇప్ప‌టికీ సుంద‌ర న‌గ‌రాలుగా పిలుచుకుంటారు. అనాదిగా వ‌స్తోన్న సంస్కృతి ఇప్ప‌టికీ కొన్నిచోట్ల‌ ప్ర‌పంచ న‌గ‌రాల్లో అంత‌రించిపోయినా ఇట‌లీలో వాడుక‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ఇటలీ నేప‌థ్యంలో ఎక్కువ భాగం షూటింగ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అవ‌సరం అనుకున్న చోట సెట్లు నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

ఇట‌లీ అందాల్ని సాధార‌ణ కెమెరాలో బందీ చేస్తేనే ఎంతో అద్భుతంగా క‌నిపిస్తాయి. అలాంటిది దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో పూర్తిగా ఇట‌లీ నేప‌థ్యాన్నే ఎంచుకున్నారంటే? అక్క‌డి అందాల్ని ఇంకెంత ర‌మ‌ణీయ‌తతో చూపిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం వ‌ర‌ల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్- టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జ‌న‌వ‌రి 14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.