Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' రీలీజ్ వేళ ప్రభాస్ సరికొత్త రికార్డ్
By: Tupaki Desk | 26 Feb 2022 5:39 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నటించిన విజువల్ వండర్ `రాధేశ్యామ్`. విధికి ప్రేమకు మధ్య సాగే గమ్మత్తైన ఆట నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. పిరియాడిక్ నేపథ్యంలో సాగే వింటేజ్ లవ్ స్టోరీ ఇది. ఈ మూవీ రిలీజ్ వేళ ప్రభాస్ సరికొత్త ఘనతని సాధించిన హీరోగా రికార్డుని సాధించడం విశేషం.
`బాహుబలి`తో తెలుగు సినిమా స్వరూపమే ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ తరువాత ప్రతీ ఒక్కరి దృష్టి టాలీవుడ్ పై పడుతోంది. ఏ సినిమా వచ్చినా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దీంతో ప్రతీ హీరో పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటించడానికే అధిక ప్రాధాన్యత నిస్తున్నాడు. ప్రభాస్ కూడా `బాహుబలి` తరువాత పాన్ ఇండియా స్థార్ గా మారడంతో భారీ చిత్రాల్లో నటించడానికే అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. అంతకు మించి అనే స్థాయిలో ఆయనతో సినిమాలు నిర్మించే దర్శకనిర్మాతలు ప్రాజెక్ట్ లని ప్లాన్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆరు భారీ చిత్రాలని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో రెండు చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా ఆ రెండు చిత్రాల్లో `రాధేశ్యామ్` రిలీజ్ కు రెడీ అయిపోయింది. మార్చి 11న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే `బాహుబలి`తో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ `రాధేశ్యామ్`తో సరికొత్త రికార్డుని సొంతం చేసుకోవడం విశేషం.
ఈ మూవీ అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదల కాబోతోంది. రిలీజ్ కి ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 10న ఈ మూవీ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ విషయంలో ప్రభాస్ అరుదైన ఘనతని సాధించిన హీరోగా రికార్డు సాధించబోతున్నారు. ఈ సినిమాని యూఎస్ లో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. 1116 లొకేషన్ లలో 3116 స్క్రీన్ లలో 11116 షోస్ ని వేయబోతున్నారు. ప్రీమియర్ షో రోజు మరో సినిమా థియేటర్లలో లేకపోవడంతో `రాధేశ్యామ్` చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇలా ఒక హీరో సినిమాని ఈ స్థాయిలో ప్రదర్శించడం అక్కడ ఇదే తొలి సారి. ఈ ఘనతని సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలవడం రికార్డుగా చెబుతున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రేమపావురాలు ఫేమ్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటించారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీలో యూరప్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. డావిన్సీ ఓడ... ఇటలీలో మిస్సయిన ట్రైన్ వంటి దృశ్యాలు కూడా ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీలింగ్ ని ప్రేక్షకులకు అందించబోతున్నాయని చెబుతున్నారు. యువీ క్రియేషన్స్ , టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ సినిమా ని మరింతగా దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేయబోతున్నాయని తెలిసింది.