Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' మరీ శృతి మించిందా?
By: Tupaki Desk | 22 Jun 2021 3:30 PM GMTప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్ చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. 1980 కాలం యూరప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లుగా యూనిట్ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ కోసం ఏకంగా 26 సెట్టింగ్స్ ను వేయించారు. నాలుగు పదుల సంవత్సరాల క్రితం యూరప్ వాతావరణంను రీ క్రియేట్ చేసేందుకు యూనిట్ సభ్యులు చేసిన ప్రయత్నంకు గాను ఏకంగా వంద కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని సమాచారం అందుతోంది.
సినిమాలోని సన్నివేశాలను చాలా నాచురల్ గా చూపించడం కోసం ఈ సెట్స్ ను అత్యాధునిక పద్దతులు ఉపయోగించి రూపొందించారని సమాచారం అందుతోంది. రాధే శ్యామ్ సినిమా కోసం వేసిన సెట్టింగ్స్ బడ్జెట్ శృతి మించినట్లుగా ఉందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం ప్రభాస్ మార్కెట్ నేపథ్యంలో ఆమాత్రం ఖర్చు చేయడంలో తప్పు లేదని అంటున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ను అతి త్వరలోనే పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లకు అంతరాయం లేకుండా ఈ సినిమా షూటింగ్ ను త్వరగా ముగించేయాలని దర్శకుడు రాధాకృష్ణ కూడా చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడం వల్ల భారీ మొత్తంలో అదనపు భారం పడుతున్నా కూడా నిర్మాతలు ప్రభాస్ పై నమ్మకంతో ఖచ్చితంగా రిటర్న్ వస్తాయని ఆశతో ఉన్నారట.