Begin typing your search above and press return to search.
కొత్త లోకం పోదామా రా(ధే)మా హరే.. సడెన్ ప్లాన్ ఛేంజ్..!
By: Tupaki Desk | 30 Sep 2020 12:10 PM GMTమహమ్మారీ అన్నిటినీ మార్చేస్తోంది. ముఖ్యంగా మనిషి మైండ్ సెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. మునుపటితో పోలిస్తే బుర్రలు షార్ప్ గా పని చేస్తున్నాయి. ప్లానింగ్ పరంగా చాకచక్యం అలవాటు చేస్తోంది. ఓవైపు లోకల్ షూటింగులకు తలుపులు ఓపెన్ చేస్తే.. మరికొందరు మాత్రం విదేశీ షూటింగుల కోసం విమానం ఎక్కేందుకు ప్రిపేరవ్వడం కనిపిస్తోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడ్ కూడా మారింది. ఆల్రెడీ హైదరాబాద్ ఔటర్ లో పడిపోయిన సెట్స్ ని పునరుద్ధరించే కంటే యూరప్ వెళ్లిపోతేనే బెటర్ అంటూ ఆలోచించారట. రాధే శ్యామ్ చిత్రీకరణను తిరిగి ఇటలీలో ప్రారంభించేస్తున్నారు. రాధే శ్యామ్ 1970 లలో ఐరోపాలో సాగే అందమైన ప్రేమకథ. అందుకు తగ్గట్టే రాధా కృష్ణ కుమార్ ఈ మూవీ నేపథ్యాన్ని సన్నివేశాల్ని ఇటలీ యూరప్ దేశాలను దృష్టిలో ఉంచుకునే రాసుకున్నారు. కానీ మహమ్మారీ లాక్ డౌన్ అన్నిటినీ చెడగొట్టింది.
ఆ తర్వాత హైదరాబాద్ లో సెట్స్ వేసి చేసేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడు తిరిగి తొలిగా అనుకున్నట్టే .. సెట్స్ లో కాకుండా కొత్త షెడ్యూల్ ని ఇటలీలో లైవ్ గా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే టీమ్ అక్కడ వాలిపోయింది. ఈ గురువారం నుంచి చిత్రీకరణ సాగనుంది. ప్రభాస్- పూజా హెగ్డేపై కొన్ని కీలకమైన ఎపిసోడ్లు ఇటలీలో రెండు వారాల పాటు చిత్రీకరిస్తారు. ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి పనిలోకి వస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ పూర్తయితే.. హైదరాబాద్ షెడ్యూల్ అక్టోబర్ చివరిలో ప్రారంభమవుతుంది. విరామం లేకుండా షూటింగ్ కొనసాగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన సెట్ లో ఈ షెడ్యూల్ తెరకెక్కాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి 2021 వేసవిలో విడుదల చేయాలన్నది ప్లాన్. యువి క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.