Begin typing your search above and press return to search.
రాధేశ్యామ్.. ఆ 10నిమిషాలు ఊపిరాడదట!
By: Tupaki Desk | 29 Nov 2021 2:50 AM GMTప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా `రాధేశ్యామ్` 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ కాపీని తన సన్నిహితులతో కలిసి ప్రభాస్ వీక్షించారు. ఫైనల్ అవుట్ పుట్ పై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాధేశ్యామ్ ఒక అందమైన ప్రేమకథ.. ఎంతో ఆహ్లాదకరంగా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుందన్న నమ్మకం కుదిరిందట. ముఖ్యంగా ఇందులో పది నిమిషాల ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుందట.
ఆ ప్రధాన ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా వీక్షించిన వారంతా ఈ ఎపిసోడ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ప్రభాస్ కి చెప్పారట. అయితే అది లవ్ ఎపిసోడ్ నా లేక యాక్షన్ ఎపిసోడ్ నా? ఇంకేదైనా లాజికల్ సన్నివేశమా? అన్నది పెద్ద తెరపై చూసి ప్రేక్షకులు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ప్రీమియర్ వీక్షించాక ప్రభాస్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. హిందీలో టీ-సిరీస్ సంస్థ విడుదల చేయనుంది.
ప్రభాస్ తదుపరి బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తో సలార్ చిత్రీకరణ పూర్తవుతోంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి.
రాధేశ్యామ్ తో ఘనవిజయం అందుకుని తదుపరి భారీ పాన్ ఇండియా చిత్రాలతో తన స్థాయిని మరో లెవల్ కి తీసుకెళ్లేందుకు బలమైన ప్రణాళికల్ని ప్రభాస్ కలిగి ఉన్నాడు. నాగ్ అశ్విన్ తో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చిత్రీకరణ ఇంతకుముందు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాటి హీరోలతో పోలిస్తే అతడి స్పీడ్ హాట్ టాపిక్ గా మారుతోంది.